Movie News

‘జాంబీ రెడ్డి’పై రాజకీయ రచ్చకు చెక్… డైరెక్టర్ వివరణ ఇదే

టాలీవుడ్ లో రెండంటే రెండు సినిమాలతోనే సత్తా కలిగిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ తాజా చిత్రం ‘జాంబీ రెడ్డి’పై ఇటీవల రాజకీయంగా పెద్ద రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. టైటిల్ లో రెడ్డి అనే పేరు ఉండటంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ టీడీపీ, జనసేనలకు చెందిన పలువురు నేతలు సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈ విమర్శలన్నింటికీ చెక్ పెడుతూ స్వయంగా ప్రశాంత్ వర్మ… ఓ సుధీర్ఘ వివరణ ఇచ్చేశారు. ఈ సినిమా ఏ వర్గాన్నో, కులాన్నో లక్ష్యంగా చేసుకుని తీస్తున్న సినిమా కాదని, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలందుకునే కథాంశంతో తీస్తున్న సినిమా అని ప్రశాంత్ వర్మ వివరణ ఇచ్చారు. టైటిల్‌ను త‌ప్పుగా అర్థం చేసుకోవ‌ద్దని. ఇది ఏ కమ్యూనిటీని త‌ప్పుగా చూపించే సినిమా కాదని.. అంద‌రూ గ‌ర్వంగా ఫీల‌య్యే సినిమా ఇది అంటూ ప్రశాంత్ తన వివరణో చెప్పుకొచ్చారు.

ప్రశాంత్ వర్మ వివరణ ఇలా సాగింది. ‘‘ఇటీవ‌ల మా సినిమా టైటిల్ ‘జాంబీ రెడ్డి’ అని ప్ర‌క‌టించాం. దానికి అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ట్విట్ట‌ర్‌లో జాతీయ స్థాయిలో ట్రెండింగ్ అయ్యింది. టైటిల్ చాలా బాగుందంటూ చాలా కాల్స్‌, మెసేజ్‌స్ వ‌చ్చాయి. మీమ్స్ కూడా వ‌చ్చాయి. సినిమాకు అది యాప్ట్ టైటిల్‌. యానిమేష‌న్ చాలా బాగుందంటున్నారు. దానిపై మూడు నెల‌ల‌కు పైగానే వ‌ర్క్ చేశాం. టీమ్ ప‌డిన క‌ష్టానికి వ‌చ్చిన రిజ‌ల్ట్‌తో మేమంతా హ్యాపీగా ఉన్నాం. కొంత‌మంది మాత్రం టైటిల్‌ను త‌ప్పుగా అర్థం చేసుకుంటున్నారు. సినిమాలో ఎవ‌రినీ త‌క్కువ చేసి చూపించ‌డం, ప్ర‌త్యేకించి ఒక క‌మ్యూనిటీని త‌క్కువ చేసి చూపించ‌డం ఉండ‌దు. ఇదొక ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఫిల్మ్‌.

ప్ర‌స్తుతం మ‌నం చూస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి చుట్టూ జరిగే, క‌ర్నూలు బ్యాక్‌డ్రాప్‌లో జ‌రిగే క‌థ‌. హాలీవుడ్‌లో ఈ ర‌కం ఎపిడెమిక్ ఫిలిమ్స్ చూస్తుంటాం. అక్క‌డ న్యూయార్క్ లాంటి బ్యాక్‌డ్రాప్‌లో ఆ క‌థ జ‌రిగిన‌ట్లు చూపిస్తుంటారు. నేను క‌ర్నూలును బ్యాక్‌డ్రాప్‌గా ఎంచుకున్నాను. క‌ర్నూలులో ఇలాంటి మ‌హ‌మ్మారి త‌లెత్తితే, అక్క‌డి ప్ర‌జ‌లు ఎలా ఫైట్ చేసి, ఈ మ‌హ‌మ్మారిని నిరోధించి, ప్ర‌పంచాన్నంతా కాపాడ‌తార‌న్న‌ది ఇందులోని ప్ర‌ధానాంశం. క‌ర్నూలును క‌థ ఎంత హైలైట్ చేస్తుందో సినిమా చూస్తే తెలుస్తుంది. ద‌య‌చేసి టైటిల్‌ను త‌ప్పుగా ఊహించుకోవ‌ద్దు. ఏ కులాన్నీ త‌క్కువ‌చేసి చూపించ‌డం అనేది క‌చ్చితంగా ఈ సినిమాలో ఉండ‌దు. నా ఫ‌స్ట్ ఫిల్మ్ ‘అ!’కు జాతీయ స్థాయి గుర్తింపు వ‌స్తే, ఈ సినిమాకు అంత‌ర్జాతీయ స్థాయి గుర్తింపు వ‌స్తుంద‌ని న‌మ్ముతున్నాను. అంద‌రూ గ‌ర్వంగా ఫీల‌వుతారు.” అని ఆయ‌న వివ‌రించారు. స్వయంగా సినిమా డైరెక్టరే ఈ మేర వివరణ ఇవ్వడంతో ఇక ఈ సినిమాపైనా, టైటిల్ పైనా రాజకీయ రచ్చకు ఫుల్ స్టాప్ పడించదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

This post was last modified on August 13, 2020 11:44 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

మాకు సలహాలు ఇవ్వండి బిల్ గేట్స్‌కు చంద్ర‌బాబు ఆహ్వానం

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఐటీ దిగ్గ‌జ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు,…

29 minutes ago

శార‌దా ‘స్వామి’ తిరుమల లో చేసింది తప్పే

విశాఖ‌ప‌ట్నంలోని శార‌దాపీఠం అధిప‌తి స్వ‌రూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్ర‌చారంలో ఉన్న విష‌యం తెలిసిందే. వైసీపీ హ‌యాంలో ఆయ‌న చుట్టూ…

33 minutes ago

రిలయన్స్ న్యూ కరెన్సీ.. జియో కాయిన్

ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…

40 minutes ago

ఎన్నాళ్లకెన్నాళ్లకు?… గల్లా రీయాక్టివేట్ అయినట్టేనా?

గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…

1 hour ago

బాబు, రేవంత్ మ‌రో సీఎం.. ఫోటో వైర‌ల్‌

దావోస్ లో జ‌రుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ స‌మావేశం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాల‌కులు, వ్యాపార‌వ‌ర్గాల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తున్న సంగ‌తి…

1 hour ago

కాళేశ్వరం వివాదం.. కీలక వివరాలతో వచ్చిన వి.ప్రకాశ్

తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…

2 hours ago