అధికారికంగా ప్రకటించకపోయినా యాత్ర 2 పోస్టర్ బయటికి వచ్చేసింది. ఇంకా షూటింగ్ మొదలుకాలేదు కానీ కాన్సెప్ట్ రూపంలో రివీల్ చేద్దామని ప్లాన్ చేసుకున్న టీమ్ కు తెలిసో తెలియకుండానో ఈ రూపంలో మొత్తానికి లీకైపోయి సోషల్ మీడియాని చుట్టేస్తోంది. నిజానికి ఈ మూవీ గురించి సైతాన్ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో దర్శకుడు మహి వి రాఘవ్ చూచాయగా చెప్పారు తప్ప ఖచ్చితంగా ఫలానా డేట్ కి మొదలుపెట్టబోతున్నామని అనలేదు. అఫీషియల్ గా వచ్చే వారం ఈవెంట్ ద్వారా చేద్దామనుకున్నారు కానీ మొత్తానికి కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. టైటిల్ రోల్ తమిళ హీరో జీవా చేయబోతున్నట్టు వారాల క్రితమే లీక్ ఉంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం గురించి ఇందులో చూపించబోతున్నట్టు ఆల్రెడీ టాక్ ఉంది. ముఖ్యంగా వైసిపి పార్టీ అధికారంలోకి రావడానికి దోహదం చేసిన పాదయాత్రను ఇందులో హైలైట్ చేయబోతున్నారు. విడుదలని ఫిబ్రవరి 2024 ఫిక్స్ చేసేశారు. అంటే ఎన్నికలు ఇంకో రెండు మూడు నెలల్లో జరగబోతుండగా రిలీజ్ ని ప్లాన్ చేయడమంటే రెండు రకాల ప్రయోజనాలు ఉంటాయి. మొదటిది జగన్ గొప్పదాన్ని స్క్రీన్ మీద చూపించవచ్చు. ఎలక్షన్ల కోసం ఎమ్మెల్యేలు, మంత్రులు బోలెడన్ని ఫ్రీషోలు వేసినా ఏ మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు,
రెండోది యాత్ర మొదటి భాగం సమయంలో దాని ప్రభావం ఎంతో కొంత ఓటర్ల మీద పడిందనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో ఉంది. ఇది ఒకరకంగా సెంటిమెంట్ గా భావిస్తున్నారు. ఒకవైపు రామ్ గోపాల్ వర్మ వ్యూహం పేరుతో వైఎస్ చనిపోయాక జగన్ ఎలాంటి తప్పు చేయలేదని చెప్పడానికి సినిమా తీయగా, ఇటు సైడు యాత్ర 2 రూపంలో జగన్ వ్యక్తిత్వాన్ని హైలైట్ చేస్తారన్న మాట. వీటిలో కించిత్ కూడా నెగటివ్ ప్రస్తావనలు ఉండవని వేరే చెప్పనక్కర్లేదు. నాలుగేళ్లు సైలెంట్ గా ఉండి హఠాత్తుగా యాత్ర 2ని స్టార్ట్ చేయడం పక్కా ప్లాన్ కాక వేరే ఇంకేముంటుంది.
This post was last modified on October 8, 2023 4:38 pm
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…