వేసవి తీవ్ర నిరాశకు గురి చేశాక టాలీవుడ్ బాక్సాఫీస్‌లో జూన్ నెల కొంత సందడి తెచ్చింది. ఆదిపురుష్ డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ తొలి వీకెండ్లో భారీ వసూళ్లే రాబట్టింది. ఇక చివరి వారంలో వచ్చిన స్పైకి కూడా ఓపెనింగ్స్ బాగున్నాయి. సామజవరగమన సూపర్ హిట్ దిశగా అడుగులు వేస్తోంది.
జులైలో పెద్ద సంఖ్యలోనే చిన్న, మీడియం రేంజ్ సినిమాలు రాబోతున్నాయి. ఆగస్టులో ఇండిపెండెన్స్ డే వీకెండ్‌కు పెద్ద సినిమాల సందడి చూడబోతున్నాం. అంతకంటే ముందు ఒక క్రేజీ మూవీ రిలీజ్‌కు డేట్ ఫిక్సయింది. తెలుగు ప్రేక్షకులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఆగస్టు 4న విడుదల కాబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు తెలిసింది.
లేడీ సూపర్ స్టార్ అనుష్క, క్రేజీ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టిల ఆసక్తికర కలయికలో తెరకెక్కిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఎప్పుడోషూటింగ్ పూర్తి చేసుకుంది. కొన్ని నెలల నుంచి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమా టీజర్ చూసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అనుష్క, నవీన్‌ల కలయికే సినిమాకు పెద్ద ఎసెట్ కాగా.. టీజర్ మంచి ఎంటర్టైనర్ చూడబోతున్న సంకేతాలు ఇచ్చింది.
యువ దర్శకుడు మహేష్ బాబు రూపొందించిన ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ నిర్మించింది. ఇండిపెండెన్స్ డే వీకెండ్లో భోళా శంకర్, జైలర్, యానిమల్ లాంటి భారీ చిత్రాలు రాబోతుండగా.. ముందు వారం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ బాక్సాఫీస్‌ను టేకోవర్ చేయబోతోంది. క్రేజీ కాంబినేషన్, ఆసక్తికర ప్రోమోల వల్ల ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్సే వచ్చే అవకాశముంది. నిశ్శబ్దం తర్వాత అనుష్క నుంచి, జాతిరత్నాలు తర్వాత నవీన్ నుంచి రాబోతున్న సినిమా ఇదే.
This post was last modified on July 1, 2023 5:19 pm
ఏదైనా పెళ్లో.. మరో ఫంక్షనో.. భార్యా భర్తలు ఇరువురు వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు.. సహజంగా దంపతుల్లో ఉత్సాహం ఉంటుంది. భర్త ముందుగానే…
యువతను లక్ష్యంగా పెట్టుకుని సినిమాలు తీయడం మంచిదే. అందులోనూ జెన్ జీ అభిరుచులను అర్థం చేసుకుని, వాళ్లకు అనుగుణంగా తక్కువ…
మెగాస్టార్ చిరంజీవికి బయట జనంలోనే కాదు ఇండస్ట్రీలోనూ బోలెడు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారనేది బహిరంగ రహస్యం. అది పలు…
నవంబర్ దీపావళి పండక్కు బాక్సాఫిస్ పోటీ మంచి రసవత్తరంగా మారబోతోంది. ముందుగా 'రామాయణ పార్ట్ 1' వస్తుంది కాబట్టి దానికి…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…