Movie News

ప్రోమో వైరల్.. ఇంటర్వ్యూ బయటికి రానట్టే !

టాప్ కమెడియన్స్ లో కొందరు మిమిక్రీ ఇమిటేషన్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బ్రహ్మానందం, ఆలీ , వేణుమాధవ్ ఇలా చాలా మంది మిమిక్రీ, ఇమిటేషన్ తో పేరు తెచ్చుకున్న వారే. పలాన వ్యక్తి ఎలా మాట్లాడతారో చూసి ఐదు నిమిషాల్లో పట్టేసి ఇమిటేట్ చేయడంలో వీరు దిట్ట. అయితే తాజాగా కమెడియన్ సత్య కూడా ఇలాంటి ఇమిటేషన్ మిమిక్రీ టాలెంట్ తో ప్రేక్షకులకి షాక్ ఇచ్చాడు.  సత్య కామెడీ టైమింగ్ గురించి అందరికీ తెలిసిందే. ‘రంగబలి’ సినిమా ప్రమోషన్ కోసం  నాగ శౌర్య తో కలిసి ఓ డిఫరెంట్ ఇంటర్వ్యూ చేశాడు సత్య. అందులో భాగంగా కొంతమంది జర్నలిస్టులను ఇంటర్వ్యూలను ఇమిటేట్ చేసిన విధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. సత్యలో ఉన్న మరో కోణాన్ని ఈ ఇంటర్వ్యూ బయటపెట్టి మంచి వినోదం పంచింది.

సత్య ఇమిటేట్ చేసిన ఇంటర్వ్యూ తాలూకు ప్రోమో ఇలా విడుదలయిందో లేదో అలా కొన్ని నిమిషాలకే సోషల్ మీడియాలో  వైరల్ అయిపోయింది. నెటిజన్లు ప్రోమో  పదేపదే చూస్తూ ఫుల్ ఇంటర్వ్యూ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అలా సత్య చేసిన నాగ శౌర్య ఫుల్ ఇంటర్వ్యూ వెయిట్ చేస్తున్న అందరికీ టీం తీసుకున్న నిర్ణయం షాక్ ఇచ్చేలా ఉంది.  ఈ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో సత్య ఒక పత్రికా ,టివీ ఛానెల్ అధిపతి, వెబ్ మీడియా జర్నలిస్ట్ కం ఇంటర్వ్యూవర్ , లేడీ న్యూస్ యాంకర్ , అలాగే నిత్యం కాంట్రవర్సీ ప్రశ్నలతో వైరల్ అవుతున్న ఓ పత్రికాదిపతి ను ఇలా ట్రెండింగ్ లో ఉండే వ్యక్తులను ఇమిటేట్ చేస్తూ వారి వేషధారణలో కనిపించాడు.

దీంతో ట్రెండ్ పట్టుకొని కొందరు వ్యక్తులను సత్య ఇమిటేట్ చేసిన ఇంటర్వ్యూ ప్రోమో విపరీతంగా వైరల్ అయింది. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ ఫుల్ ఇంటర్వ్యూ ఇక బయటికి రాదని తెలుస్తోంది. ప్రోమో వైరల్ అవ్వడంతో సదరు వ్యక్తుల్లో ఇద్దరు ముగ్గురు బాగా హర్ట్ అయ్యారని టీమ్ ను సంప్రదించి ఫుల్ ఇంటర్వ్యూ రావడానికి వీల్లేదని చెప్పారని సమాచారం.

దీంతో ఆ వ్యక్తుల మనో భావాలని దెబ్బతీయడం వారి మనసు కష్ట పెట్టడం ఇష్టం లేక టీమ్ ఈ ఇంటర్వ్యూ ను బయటికి రాకుండా ఓ నిర్ణయం తీసుకున్నారట. మరి సదరు వ్యక్తులు టీమ్ ను రిక్వెస్ట్ చేశారా ? లేదా తమ మీడియా సంస్థల్లో సినిమాను ప్రమోట్ చేయకుండా దుష్ప్రచారం చేస్తామని భయపెట్టారా తెలియదు. ఏదేమైనా ఫుల్ ఇంటర్వ్యూ వచ్చినా, రాకపోయినా  ప్రోమోతో సినిమాకు కావాల్సిన ప్రమోషనల్ బజ్ వచ్చేసింది.

This post was last modified on July 1, 2023 6:10 am

Share

Recent Posts

నాని వాళ్ళని ఎప్పటికీ వదలడు

నేచుర‌ల్ స్టార్ నాని అంటే ఒక‌ప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్ట‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఎక్కువ‌గా ఫ్యామిలీ ట‌చ్ ఉన్న…

47 minutes ago

డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ చేసేవాడ్ని

నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…

4 hours ago

ప్యార‌డైజ్ ద‌ర్శ‌కుడు రాజమౌళి ద‌గ్గ‌ర చేరతాడ‌ట‌

ఇండియాస్ నంబ‌ర్ వన్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ విభాగంలో ప‌ని చేయాల‌ని కాబోయే డైరెక్ట‌ర్ కావాల‌నుకున్న ప్ర‌తి వ్య‌క్తికీ…

4 hours ago

ట్రైలర్ లేకపోవడం ఎంత వరకు సేఫ్

అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…

6 hours ago

ఇంద్ర చూపిన దారిలో మిగిలినవీ రావాలి

తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…

7 hours ago

అసలు భయాన్ని థియేటర్‌లో చూపిస్తారేమో

ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…

8 hours ago