ఈ ఏడాది బాక్సాఫీస్ దగ్గర బాగా సందడి చేసిన చిత్రాల్లో ‘దసరా’ ఒకటి. నాని మిడ్ రేంజ్ హీరోనే కానీ.. ఈ సినిమాకు మాత్రం పెద్ద సినిమాల రేంజిలో ఓపెనింగ్స్, థియేటర్లలో హడావుడి కనిపించాయి. ఈ చిత్రంతోనే దర్శకుడిగా పరిచయం అయిన శ్రీకాంత్ ఓదెల గురువు సుకుమార్‌కు తగ్గ శిష్యుడినే అనిపించుకున్నాడు. బడ్జెట్ హద్దులు దాటడం వల్ల దసరా సూపర్ హిట్ రేంజికి వెళ్లలేదు కానీ.. శ్రీకాంత్ మాత్రం విషయం ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు.
స్టార్ హీరోలను బాగానే డీల్ చేయగలడన్న చర్చ జరిగింది అతడి గురించి. రెండో సినిమాను ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో చేయడానికి ప్రయత్నించాడతను. ‘భోళా శంకర్’ తర్వాత ఏ సినిమా చేయాలనే విషయంలో చిరు కన్ఫ్యూజన్లో ఉండగా.. ఆయన పరిశీలించిన దర్శకుల్లో శ్రీకాంత్ ఓదెల కూడా ఉన్నాడు. శ్రీకాంత్ లాగే మరికొందరు దర్శకులూ చిరుతో సినిమా కోసం ఒకే సమయంలో ప్రయత్నించారు.
ఐతే ముందు నుంచి వర్క్ చేస్తూ, సమయానికి చిరును మెప్పించిన కళ్యాణ్ కృష్ణ కురసాలతో సినిమా ఓకే అయిపోయింది. బింబిసార దర్శకుడు వశిష్ట కూడా చిరును మెప్పించినట్లు తెలుస్తోంది. శ్రీకాంత్‌కు చాలినంత సమయం లేకపోవడం, సమయానికి స్క్రిప్టు రెడీ కాకపోవడంతో అతడికి ‘మెగా’ ఛాన్స్ దక్కలేదు. ఐతే ఇందుకు శ్రీకాంత్ ఏమీ నిరాశ చెందలేదు. అతను మరో మెగా హీరోనే టార్గెట్ చేసినట్లు తాజా సమాచారం.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో శ్రీకాంత్ ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నాడట. ‘పుష్ప-2’ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో బన్నీ ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ తర్వాతి ప్రాజెక్టు విషయంలో క్లారిటీ లేదు. శ్రీకాంత్ ఆ అవకాశం దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడట. మంచి మాస్ కథతో బన్నీని మెప్పించే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. బన్నీకి ఒక లైన్ చెప్పి దాని మీద వర్క్ చేస్తున్నాడట. ఫుల్ స్క్రిప్టుతో మెప్పిస్తే సినిమా ఉంటుంది.
This post was last modified on June 30, 2023 4:07 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…