భీమ్లా నాయక్ తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ రావడంతో ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ ని తెరమీద చూద్దామాని ఎదురు చూస్తున్న అభిమానుల కోసం బ్రో వచ్చే నెల జూలై 28న థియేటర్లలో అడుగు పెడుతున్నాడు. వినోదయ సితం రీమేక్ గా దీని మీద తొలుత కొంత నెగటివిటీ ఉన్నప్పటికీ పోస్టర్లు క్రమంగా దాన్ని తగ్గిస్తూ వచ్చాయి. ఇంకో ముప్పై రోజుల్లో రిలీజ్ ఉండటంతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రమోషన్ వేగం పెంచింది. ఇవాళ టీజర్ లాంచ్ చేశారు. వారాహి యాత్రతో భీమవరంలో బిజీగా ఉన్న పవన్ దగ్గరకు వెళ్లి మరీ డబ్బింగ్ చెప్పించుకు వచ్చారు.
టీజర్ లో చూచాయగా కాన్సెప్ట్ ఏంటో చెప్పారు. జీవితంలో, జాబులో రకరకాల కారణాలతో విసుగెత్తిపోయిన ఓ యువకుడు(సాయి ధరమ్ తేజ) వాటికి పరిష్కారం కోసం ఎదురు చూస్తుంటాడు. ఆశలు అడుగంటిపోయి చీకటిలో ఉన్నట్టు ఫీలవుతున్న టైంలో పవర్ రూపంలో ఒక శక్తి(పవన్ కళ్యాణ్) వస్తుంది. మనిషిలాగే కనిపిస్తున్నా సమయం అతని కోసమే అలా వచ్చిన విషయం ఎవరికీ అర్థం కాదు. అక్కడి నుంచి ఆ కుర్రాడి లైఫ్ మారిపోతుంది. సరదాగా మొదలై సవాళ్ల దాకా వెళ్లి యాక్సిడెంట్లను చూస్తుంది. ఈ బ్రోల మధ్య బంధం ఏంటో అర్థం కావాలంటే జూలై 28 దాకా ఆగాలి
వీడియో మొత్తం పవన్ స్వాగ్ తో నిండిపోయింది. తమ్ముడులో పంచ గెటప్, జల్సాలో కాస్ట్యూమ్, బద్రి నాటి స్టైల్ ఇలా అన్ని మ్యానరిజంస్ ని దర్శకుడు సముతిరఖని ఇందులో పెట్టేశాడు. పవర్ స్టార్ డైలాగ్ డెలివరీ వెరైటీ యాసతో సాగింది. తేజు కాంబోలో సీన్లు అభిమానులకు పండగే. ఒరిజినల్ వెర్షన్ కు కీలకమైన మార్పులు చాలానే చేసిన రచయిత త్రివిక్రమ్ పూర్తిగా ఫ్యాన్ స్టఫ్ ఇచ్చేశాడు. దానికి తగ్గట్టే తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంచి ఎలివేషన్ ఇచ్చింది. ఇతర క్యారెక్టర్లను రివీల్ చేయలేదు. అంచనాలను అమాంతం పెంచేయడంలో బ్రో పూర్తిగా సక్సెస్ అయ్యాడు
This post was last modified on June 29, 2023 10:29 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…