Movie News

‘వి’ ఒక్కటే కాదు.. ఇంకో మూడు

మొత్తానికి కొన్ని నెలలుగా నెలకొన్న ప్రతిష్ఠంభనకు తెరపడింది. హిందీ, తమిళం, మలయాళం లాంటి భాషల్లో పేరున్న సినిమాలు నేరుగా ఓటీటీల్లో రిలీజవుతుంటే.. తెలుగు నిర్మాతలు మాత్రం మార్పును స్వీకరించకుండా మడి కట్టుకుని కూర్చున్నారనే అభిప్రాయాలు వినిపించాయి. మన దగ్గర 47 డేస్, కృష్ణ అండ్ హిజ్ లీల, భానుమతి రామకృష్ణ, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య లాంటి చిన్న సినిమాలు మినహాయిస్తే.. కాస్త పేరున్న సినిమాలేవీ నేరుగా ఓటీటీల్లో రిలీజ్ కాలేదు. అలాగని విడుదలకు సిద్ధంగా ఉన్న మీడియం, పెద్ద రేంజ్ సినిమాలు లేవా అంటే అదేం కాదు. వి, ఉప్పెన, రెడ్ లాంటి చిత్రాలు ఫస్ట్ కాపీతో రెడీ అయిన స్థితిలో ఉన్నాయి.

కానీ తాము ఆశించిన స్థాయిలో రేటు రాలేదో.. లేక తమ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తేనే బాగుంటందనో.. లేక అలా చేస్తేనే ఎక్కువ ఆదాయం వస్తుందో.. ఇలా వివిధ కారణాలతో మన నిర్మాతలు ఆగిపోయారు. హిందీలో అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్ లాంటి హీరోలు నటించిన సినిమాలే ఓటీటీల్లో నేరుగా రిలీజవుతుంటే మనవాళ్లు ఆలోచించేదేంటి అన్న ప్రశ్నలు తలెత్తినా మన నిర్మాతలు వెనుకంజ వేయలేదు. థియేటర్లు త్వరలో తెరుచుకుంటాయి అనుకుంటూ ఎదురు చూశారు. కానీ ఇలాగే ఐదు నెలలు గడిచిపోయాయి. ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకుని మామూలుగా నడిచే పరిస్థితి లేదని అర్థమైంది.

వడ్డీల భారం లెక్కలు కట్టాక ఇంకొన్ని నెలలు ఎదురు చూసి థియేటర్లలో రిలీజ్ చేసినా ప్రయోజనం లేదని బోధ పడింది. ఈ నేపథ్యంలోనే ముందుగా దిల్ రాజు ధైర్యం చేసి ‘వి’ చిత్రాన్న అమేజాన్ ప్రైమ్ వాళ్లకు అమ్మేశారన్నది తాజా సమాచారం. రాజే పట్టు వీడాక మిగతా వాళ్ల సంగతి చెప్పేదేముంది. దీంతో ఇంకో మూడు మీడియం రేంజ్ సినిమాల నిర్మాతలు కూడా తమ చిత్రాల్ని ఓటీటీల్లో రిలీజ్ చేయడానికి రెడీ అయిపోయారని.. వీళ్లందరూ ఉమ్మడిగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారని.. త్వరలోనే ‘వి’ సహా మరో మూడు చిత్రాల ఓటీటీ రిలీజ్ గురించి అధికారికంగా ప్రకటన చేస్తారని సమాచారం.

This post was last modified on August 13, 2020 8:21 pm

Share

Recent Posts

ఇక్కడ అమ్మాయి సుప్రియకు అదిరిపోయే పదవి!

ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…

60 minutes ago

సంబరాలు అంత సాహసం చేస్తుందా

సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…

1 hour ago

కేసీఆర్ ఫ్యామిలీ భూముల లెక్క చూస్తే షాకే!

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…

1 hour ago

ఇలాంటి కొడుకులు కూడా ఉంటారు..

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…

2 hours ago

నిద్రాహారాలు కాదు ముందు పనవ్వాలి

ఒక గంట కునుకు పడితే ఎక్కడ పనికి బ్రేక్ పడుతుందో అన్న రేంజ్ లో చివరి దశ ప్యారడైజ్ పనులను…

3 hours ago

ఇక పై కోడి కెలికినట్టు రాస్తే కుదరదు!

దేవుడు నుదుటి మీద రాసే రాతైనా అర్ధం అవుతుందేమో కానీ వైద్యుడు రాసే మందుల పేర్లు మాత్రం అర్ధం కావన్నది…

4 hours ago