ఇటీవలే అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయిన రాకేష్ మాస్టర్ విషయంలో యూట్యూబ్ ఛానెల్స్ తీరు మారాలని ఆయన శిష్యుడు, ప్రస్తుత టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ విన్నవించాడు. రాకేష్ మాస్టర్ చనిపోయినప్పటి నుంచి యూట్యూబ్ ఛానెల్స్ ఇష్టం వచ్చిన థంబ్ నైల్స్ పెట్టి నోటికొచ్చింది రాసేస్తున్నారని.. వాళ్లకు విషయం తెలిస్తేనే రాయాలని.. అలా కాకుండా ఏదేదో ఊహించి రాయడం కరెక్ట్ కాదని.. ఇకనైనా ఇలాంటివి ఆపేయాలని శేఖర్ కోరాడు.
రాకేష్ మాస్టర్ మీద తన అభిమానం ఎలాంటిదో.. తమ మధ్య ఎంతటి అనుబంధం ఉందో ఆయన పెద కర్మ కార్యక్రమంలో శేఖర్ వెల్లడించాడు. రాకేష్ మాస్టర్‌ను తన గురువు అని చెప్పుకోవడానికి ఎప్పుడూ తాను గర్వపడతానని.. తాను కష్టాల్లో ఉన్నపుడు ఆశ్రయం ఇచ్చి ఆదుకున్నది ఆయనే అని శేఖర్ తెలిపాడు.
తాను ప్రభుదేవాను చూసి స్ఫూర్తి పొంది ఇండస్ట్రీకి వచ్చానని.. కానీ తనకు ఆశ్రయం ఇచ్చి డ్యాన్స్ నేర్పింది మాత్రం రాకేష్ మాస్టరే అని శేఖర్ తెలిపాడు. తనతో పాటు సత్యం మాస్టర్‌కు ఆయన ఇన్‌స్టిట్యూట్‌లో అవకాశం దక్కిందని.. తాము ఫీజ్ లేకుండా అక్కడ డ్యాన్స్ నేర్చుకున్నామని.. అలాగే తర్వాత ఇన్‌స్టిట్యూట్లో పిల్లలకు క్లాసులు చెప్పేవాళ్లమని శేఖర్ తెలిపాడు.
అప్పట్లో తమకు డ్యాన్స్ తప్ప మరో లోకం తెలియదని.. రాకేష్ మాస్టర్ పెళ్లి చేసింది కూడా తామే అని శేఖర్ వెల్లడించాడు. మాస్టర్ ఎక్కడున్నా బాగుండాలని కోరుకునేవాడినని.. కానీ ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదని శేఖర్ ఆవేదన వ్యక్తం చేశాడు. రాకేష్ మాస్టర్ డ్యాన్సుల్లో 5 శాతం మాత్రమే యూట్యూబ్ ఛానెళ్లలో చూశారని.. ఆయన అంతకుమించి గొప్ప డ్యాన్సర్ అని.. అలాంటి వ్యక్తి ఇంత త్వరగా అందరినీ విడిచి వెళ్లిపోవడం బాధాకరమని శేఖర్ అన్నాడు.
This post was last modified on June 29, 2023 5:28 pm
ఏప్రిల్ 10 ది రాజా సాబ్ రావడం లేదనేది అందరికీ తెలిసిన విషయమే అయినా టీమ్ ఇప్పటిదాకా ఆ విషయాన్ని…
ఇరవై రెండు సంవత్సరాల క్రితం రిలీజైన జానీ ఇప్పటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక కల్ట్ లా ఫీలవుతారేమో కానీ…
ఆరాధన సినిమాలో పులిరాజు పాత్ర పోషించిన చిరంజీవి ఎక్స్ ప్రెషన్ ని తన ఆఫీస్ లో ఫోటో ఫ్రేమ్ గా…
అనూహ్యంగా చోటు చేసుకున్న ప్రమాదానికి గురైన భర్తను కాపాడుకునేందుకు ఒక ఇల్లాలు చేసిన ప్రయత్నం అందరిని ఆకర్షిస్తోంది. ఈ ఉదంతం…
కాలం కలిసి వచ్చి.. గాలి వాటంగా వీసే వేళలో.. తమకు మించిన తోపులు మరెవరు ఉండరన్నట్లుగా మాటలు మాట్లాడే గులాబీ…
ట్రాఫిక్ ఉల్లంఘనలకు చలానాలు విధిస్తూ ఉంటారు ట్రాఫిక్ పోలీసులు. ఇంతవరకు ఓకే. హైదరాబాద్ మహానగరంలో అయితే.. ట్రాఫిక్ నియంత్రణ వదిలేసి…