టాలీవుడ్ లో స్టాండర్డ్ కమెడియన్స్ కొరత చాలా ఉంది. ఒకప్పుడు బ్రహ్మానందం, ఆలీ, ఎంఎస్, ధర్మవరపు వీళ్ళందరూ సినిమాలోని వినోదాన్ని తమ భుజాల మీద మోసి ప్రత్యేకంగా ఫ్యాన్స్ కి పెంచుకున్న్నారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. అంతా సీజనల్. ప్రత్యేకంగా అన్ని చిత్రాల్లో కనిపించే వాళ్ళు అరుదైపోయారు. కొందరికి టాలెంట్ ఉన్నా వాటిని సరిగా వాడుకునే దర్శకులు లేక కంటిన్యూగా అవకాశాలు రావు. వాళ్లలో సత్యది ప్రత్యేక స్థానం. బొద్దుగా నల్లగా ఉన్నా వైవిధ్యమైన బాడీ లాంగ్వేజ్, టైమింగ్ తో ఆకట్టుకోవడం ఇతని శైలి. ఈ మధ్య కనిపించడం తగ్గింది.
సత్యకి మిమిక్రి బాగా వచ్చన్న సంగతి సన్నిహితులకు తెలుసు కానీ ప్రేక్షకులకు అంతగా అవగాహన లేదు. నాగ శౌర్య హీరోగా రూపొందిన రంగబలి టీమ్ ఈ ఛాన్స్ వాడేసింది. ఓ వీడియోలో నాగశౌర్యని ఇంటర్వ్యూ చేస్తూ మీడియా ముఖాముఖీల్లో వివిధ రకాల యాంకర్లను అచ్చు గుద్దినట్టు ఇమిటేట్ చేసి వామ్మో అనిపించేశాడు. ఒక న్యూస్ ఛానల్ అధిపతి, వెబ్ యాంకర్, తలతిక్క వ్యాఖ్యాత, విపరీతంగా ప్రవర్తించే లేడీ జర్నలిస్ట్, కాంట్రవర్సీ ప్రశ్నలు అడిగే మ్యాగజైన్ ప్రతినిధి ఇలా అందరిని యధాతథంగా దించేశాడు. ట్రైలర్ చూసిన ఫ్యాన్స్ సినిమా స్థాయిలో ఎంటర్ టైన్మెంట్ ఉందని కితాబిస్తున్నారు.
మొత్తానికి రంగబలి బృందం వేసిన వెరైటీ ఐడియా బాగుంది. ఇంతకు ముందు గీత రచయిత అనంత శ్రీరామ్ గొడవ వీడియోతో ఏదో వైరల్ కంటెంట్ సృష్టిద్దాం అనుకున్నారు కానీ అదంత వర్కౌట్ కాలేదు. కానీ సత్యది మాత్రం పేలేలా ఉంది. గత కొంత కాలంగా హిట్లు లేక ఇబ్బంది పడుతున్న నాగ శౌర్యకి దీని సక్సెస్ చాలా కీలకం. బడ్జెట్ బాగానే ఖర్చు పెట్టారు. కామెడీ, యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయని ట్రైలర్ చూశాక అనిపించింది. దానికి తగ్గట్టే సినిమా కూడా ఉంటే హిట్టు పడ్డట్టే. హీరోతో పాటే ఎక్కువ సేపు స్క్రీన్ షేర్ చేసుకునే పాత్రలో సత్యకు మంచి ప్రాధాన్యం దక్కింది.
This post was last modified on June 29, 2023 10:37 pm
అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో…
మాజీ సీఎం జగన్, వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాకపోవడంపై ఏపీ శాసన మండలి సమావేశాల్లో పెను దుమారం రేగింది. జగన్…
వైసీపీ ఎంపీగా గెలిచిన కొద్ది నెలల తర్వాత ఆ పార్టీపై రఘురామకృష్ణరాజు తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. నాలుగేళ్లపాటు…
వైసీపీ హయాంలో ఆ పార్టీ మద్దతుదారులు, సానుభూతిపరులు సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీల నేతలు, వారి కుటుంబ సభ్యులపై పెట్టిన…
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు దీరి ఆరు మాసాలు కూడా కాలేదు. కేవలం ఐదు మాసాలు మాత్రమే పూర్తయింది. కానీ,…
వంశీ పైడిపల్లికి యావరేజ్ డైరెక్టర్ అని పేరుంది. అతను గొప్ప సినిమాలేమీ తీయలేదు. కానీ.. అతను కెరీర్లో ఇప్పటిదాకా పెద్ద…