ఈ రోజుల్లో లిప్ లాక్ సీన్లనేవి చాలా కామన్ అయిపోయాయి. హీరో హీరోయిన్లలో చాలామంది ఏమాత్రం సంశయం లేకుండా అవి చేసేస్తున్నారు. ఒక సినిమాలో.. లేదా సిరీస్‌లోనే బోలెడన్ని లిప్ లాక్ సీన్లు లాగించేస్తున్నారు. జనం కూడా వాటిని మామూలుగానే చూసేస్తున్నారు. కానీ ఒక ఇరవయ్యేళ్ల ముందు అంటే ఇండియన్ సినిమాల్లో ముద్దు సీన్లు తక్కువగాన చూసేవాళ్లం.
అలాంటిది ఒక సీరియల్లో లిప్ లాక్ అంటే పెద్ద షాక్ అన్నట్లే. ఐతే బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా.. చాలా ఏళ్ల కిందట ఒక సీరియల్లో ముద్దు సీన్ చేసిందట. తనకు అది చాలా అసౌకర్యంగా ఉండటంతో సీన్ అయ్యాక డెటాల్ వేసి నోరు కడుక్కున్నట్లు ఆమె వెల్లడించింది. ఈ అనుభవం గురించి తాను కీలక పాత్ర పోషించిన ‘లస్ట్ స్టోరీస్-2’ ప్రమోషన్లలో ఆమె మాట్లాడింది.
‘‘ఒక నటిగా అన్ని రకాల సీన్లూ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు బురదలోకి దిగాలి. కొన్నిసార్లు ఎర్రటి ఎండలో గంటల తరబడి నిలబడాలి. ఐతే నేను కొన్నేళ్లు ముందు దిలీప్ ధావన్‌తో ఒక సీరియల్లో నటించా. అందులోని ఓ సన్నివేశంలో మాపై లిప్ టు లిప్ కిస్ సీన్ తీశారు. భారత టెలివిజన్ చరిత్రలో అది మొదటి లిప్ లాక్ సీన్ అనుకుంటా. నేను ఆ సీన్ చేశాక రాత్రంతా నిద్రపోలేదు.
మేం పరిచయస్తులమే. అతను అందగాడే. కానీ దాంతో ఆ పరిస్థితులకు ఏమాత్రం సంబంధం లేదు. ఎందుకంటే నేను ఆ సీన్ చేయడానికి మానసికంగా, శారీరకంగా సిద్ధంగా లేను. ఆ సీన్ చేయడానికి నేను చాలా కంగారు పడ్డా. కొంతమంది కామెడీ చేయలేరు.. కొందరు కెమెరా ముందు కన్నీళ్లు పెట్టుకోలేరు.. అంటూ నాకు నేను నచ్చజెప్పుకుని ఆ సీన్ చేశా. కానీ ఆ సీన్ పూర్తయిన వెంటనే డెటాల్‌తో నోరు శుభ్రం చేసుకున్నా. అది నాకెంతో ఇబ్బందిగా అనిపించింది’’ అని నీనా వెల్లడించింది.
This post was last modified on June 29, 2023 9:02 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…