అసలు విడుదల తేదీకి ఒకటి రెండు రోజుల ముందే స్పెషల్ ప్రీమియర్లు వేస్తున్న స్ట్రాటజీని ఇటీవలి కాలంలో చిన్న సినిమాలు బాగా అంది పుచ్చుకుంటున్నాయి. జనంలోనూ చాలా ముందుగా చూస్తున్నామన్నా ఉత్సాహం టికెట్లు కొనేలా చేస్తోంది. నిన్న ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ఎంపిక చేసిన సెంటర్లలో వేసిన సామజవరగమన షోలకు సోషల్ మీడియాలో మంచి స్పందన కనిపిస్తోంది. ఆద్యంతం నవ్వించారని, చాలా గ్యాప్ తర్వాత శ్రీవిష్ణు తనకు తగ్గ పాత్రను ఎంచుకుని ఎంటర్ టైన్ చేశాడని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందులో తను మల్టీప్లెక్స్ ఉద్యోగిగా నటించాడు.
సీనియర్ నటులు నరేష్ మీద సైతం కాంప్లిమెంట్ల వర్షం కురుస్తోంది. ఇంట్లోనే సరదా అవమానాలకు గురయ్యే పాత్రలో చెలరేగిపోయాడని టాక్. ఫస్ట్ హాఫ్ లో తండ్రి కొడుకుల కాంబో సీన్లు బాగా వచ్చాయని అంటున్నారు. అయినా స్పెషల్ స్క్రీనింగ్స్ నుంచి వచ్చే రిపోర్ట్స్ ని వంద శాతం విశ్వసించలేం కానీ కంటెంట్ మాత్రం బాగానే కనెక్ట్ అయినట్టు కనిపిస్తోంది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన సామజవరగమనకు నిర్మాత అనిల్ సుంకర అండ దక్కడం ప్లస్ అయ్యింది. డిస్ట్రిబ్యూషన్ పరంగా మంచి థియేటర్లు వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు.
ఈ ఎక్స్ క్లూజివ్ ప్రీమియర్ల పర్వం ఈ రోజు రేపు కూడా కొనసాగబోతోంది. హైదరాబాద్ ఏఎంబి నుంచి వీటిని మొదలుపెడుతున్నారు. రేపు పలు చోట్ల జంటలకు వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రకటించారు. నిఖిల్ స్పైతో పోటీ ఉన్న కారణంగా సామజవరగమన చేతిలో ఉన్న అన్ని ప్రమోషన్ ఆయుధాలు వాడేస్తోంది. పబ్లిక్ టాక్ ఇలాంటి బడ్జెట్ సినిమాలకు కీలకం కాబట్టి దానికి అనుగుణంగా పబ్లిసిటీని పెంచుతున్నారు. ఎలాగూ స్పై యాక్షన్ థ్రిల్లర్ కాబట్టి సరదా కోరుకునే వాళ్ళు శ్రీవిష్ణుకి, థ్రిల్స్ కావాలనుకునే వాళ్ళు నిఖిల్ కి ఓటేస్తారు. ఫైనల్ గా ఇద్దరూ గెలుస్తారేమో చూడాలి
This post was last modified on June 27, 2023 7:54 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…