స్టార్ హీరోల వారసులంటే మనకు అబ్బాయిలే కనిపిస్తారు కానీ కూతుళ్లను స్క్రీన్ కు పరిచయం చేసినవాళ్లు చాలా అరుదు. చిరంజీవి, రజనీకాంత్, బాలకృష్ణ ఆ దిశగా ఎప్పుడూ ఆలోచన చేయలేదు. కమల్ హాసన్ ఆశలకు అనుగుణంగా శృతి హాసన్ ఒకరే సక్సెస్ అయ్యింది కానీ చెల్లెలు అక్షర ఇంకా బ్రేక్ కోసం ఎదురు చూస్తోంది. ఒకప్పుడు కృష్ణ తనయ మంజులని హీరోయిన్ చేయాలనుకుంటే అభిమానుల నుంచే వ్యతిరేకత వచ్చింది. రాజశేఖర్ మాత్రం ఈ విషయంలో కొంత మేర సక్సెస్ అయ్యారు. అయితే ఎవరూ తండ్రితో కలిసి ఒకే సినిమాలో నటించలేకపోయారు.
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ఎంట్రీకి రంగం సిద్ధమయ్యింది. అయితే సోలోగా కాకుండా నాన్న నటించే సినిమాలోనే భాగం పంచుకోనుంది. దీన్ని కింగ్ ఖాన్ తో పాటు పఠాన్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ సంయుక్తంగా నిర్మిస్తారు. అయితే డైరెక్టర్ ఎవరనేది మాత్రం మీడియాకు లీక్ చేయలేదు. షారుఖ్ స్వంత బ్యానర్ రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్ ఈ ప్రాజెక్టుని టేకప్ చేస్తోంది. బడ్జెట్ కూడా భారీగానే ఉండబోతోందట. సుహానా డిజిటల్ డెబ్యూ ఆల్రెడీ అయిపోయింది. నెట్ ఫ్లిక్స్ నిర్మించిన వెబ్ సిరీస్ ఆర్చీస్ వచ్చే నెల జూలైలో స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది
ఇటీవలే ముంబైలో 12 కోట్ల విలువైన స్థలాన్ని కొనుక్కుని రిజిస్ట్రేషన్ లో వ్యవసాయదారురాలిగా సుహానా ఖాన్ ని అగ్రిమెంట్ లో పేర్కొనడం పట్ల ఇప్పటికే వివాదం రేగుతోంది. షారుఖ్ దీనికి సంబంధించి స్పందించడం లేదు కానీ మొత్తానికి మీడియాలో ఇదైతే హాట్ టాపిక్ గా మారింది. కూతురిని లాంచ్ చేస్తూ అదే సినిమాలో నటించడం అభిమానులకు ఒక స్పెషల్ మెమరీ కానుంది. డ్రెస్సింగ్ విషయంలో మరీ ఎక్కువ కట్టుబాట్లు చూపించని సుహానా మరి తెరమీద ఎలాంటి పాత్రలకు ప్రాధాన్యం ఇస్తుందో చూడాలి. మరికొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన రాబోతోంది
This post was last modified on June 26, 2023 7:08 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…