మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత అతి తక్కువ అంచనాలున్న సినిమా అంటే.. భోళాశంకర్ అనే చెప్పాలి. అసలే వేదాళం లాంటి రొటీన్ మాస్ మూవీకి ఇది రీమేక్. పైగా పేలవమైన ట్రాక్ రికార్డున్న మెహర్ రమేష్ డైరెక్ట్ చేశాడు. ఇప్పటిదాకా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ప్రోమోలేవీ కూడా ఆశించిన స్థాయిలో లేవు. లేటెస్ట్‌గా వచ్చిన టీజర్ కూడా అభిమానులు అంతగా కిక్ ఇవ్వలేదు. టీజర్‌కు మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది.
ఇలాంటి సినిమా చిరంజీవి కెరీర్లోనే నంబర్ వన్ అవుతుందని స్టేట్మెంట్ ఇవ్వడం అంటే సాహసం అనే చెప్పాలి. భోళా శంకర్ నిర్మాత అనిల్ సుంకర ఆ సాహసమే చేశారు. ఈ సినిమా టీజర్‌ను హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని ఓ థియేటర్లో అభిమానుల కోలాహలం మధ్య రిలీజ్ చేశారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ అనిల్ ఈ స్టేట్మెంట్ ఇచ్చారు.
టీజర్ ఎలా ఉందని అడుగుతూ.. సినిమా ఇంతకుమించి ఉంటుందని.. చిరంజీవి కెరీర్లోనే భోళా శంకర్ నంబర్ వన్ సినిమా అవుతుందనే నమ్మకం తనకు ఉందని చెబుతూ.. టీజర్లోని దేఖ్‌లేంగే డైలాగ్ కూడా వేశారు అనిల్ సుంకర.
కానీ ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం.. ఇది మరీ విడ్డూరమైన స్టేట్మెంట్‌లా ఉందని అంటున్నారు. మరోవైపు టీజర్ రిలీజ్‌కు అభిమానుల స్పందన చూసి మెహర్ రమేష్ థియేటర్లో కన్నీళ్లు పెట్టుకున్న వీడియో కూడా వైరల్ అవుతోంది. చిరు సినిమాను డైరెక్ట్ చేసిన ఎగ్జైట్మెంట్ మెహర్‌లో ఉండొచ్చు కానీ.. భోళా శంకర్ టీజర్ అయితే అంత గొప్పగా లేదన్న మాట వాస్తవం. అందుకే మెహర్‌ను కూడా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇక టీజర్లో చిరు డైలాగ్ డెలివరీ, తెలంగాణ స్లాంగ్ విషయంలో కూడా అభిమానుల నుంచే మిశ్రమ స్పందన వస్తోంది. మరి ఆగస్టు 11న రాబోతున్న సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…