తెలుగు రిలీజ్ వాయిదా వేశారు కానీ ఫహద్ ఫాసిల్ కొత్త సినిమా ధూమం మీద మూవీ లవర్స్ కి మంచి ఆసక్తే నెలకొంది. కేవలం కర్ణాటక, కేరళ వర్షన్లు మాత్రమే థియేటర్లకు వచ్చాయి. లూసియా, యుటర్న్ లాంటి వెరైటీ థ్రిల్లర్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న పవన్ కుమార్ దర్శకత్వంతో కెజిఎఫ్-కాంతార బ్యానర్ హోంబాలే ఫిలింస్ దీన్ని నిర్మించింది. బహుభాషల్లో డబ్బింగ్ చేసినప్పటికీ ప్రమోషన్లకు తగినంత టైం లేకపోవడంతో ఫైనల్ గా మన దగ్గరకైతే రాలేదు. హైదరాబాద్ లో మలయాళంలోనే చూసేందుకు ప్రేక్షకులు రెడీ కావడంతో తగినన్ని షోలే ఇచ్చారు.
ఇదో డిఫరెంట్ థ్రిల్లర్. సిగరెట్ కంపెనీలో పని చేసే అవినాష్(ఫహద్ ఫాసిల్)కు భారీ జీతంతో పాటు చక్కని జీవితం పొందుతున్నప్పటికీ దాన్ని వదిలేయాలని నిర్ణయించుకుంటాడు. చిన్నపిల్లలు సైతం పొగబారిన పడుతుంటే తన సంస్థ వాళ్ళను సైతం కస్టమర్లుగా ట్రీట్ చేస్తున్న వైనాన్ని జీర్ణించుకోలేకపోతాడు. ఇక్కడే అవినాష్ అతని భార్య దియా(అపర్ణ బాలమురళి)ప్రమాదంలో పడతారు. టైం బాంబుకు బలి కాకుండా ఉండాలంటే తప్పనిసరిగా సిగరెట్లు తాగుతూ తక్కువ టైంలో కోటి రూపాయలు పోగు చేయాల్సిన విచిత్రమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ గండం నుంచి ఎలా బయటపడ్డారనేదే స్టోరీ
తీసుకున్న పాయింట్ వైవిధ్యంగా అనిపించినా దర్శకుడు పవన్ దాన్ని ఆసక్తికరంగా మలచడంలో ఫెయిలవ్వడంతో కథనం మరీ నీరసంగా సాగుతుంది. థ్రిల్స్ కి స్కోప్ ఉన్నప్పటికీ అవసరం లేని డ్రామాని జొప్పించడంతో కృత్రిమత్వం పెరిగిపోయి అంతకంతా ల్యాగ్ పెరిగిపోయింది. ఫహద్, రోషన్ మాత్యు, వినీత్ లు నటన పరంగా ఎలాంటి లోటు రానివ్వకపోయినా జీవం లేని సన్నివేశాలు వాళ్ళనూ నిస్సహాయులుగా మార్చాయి. ట్రైలర్, పవన్ గత చిత్రాలను బట్టి ధూమంని మరీ ఎక్కువ ఊహించుకుంటే అంతే స్థాయిలో నిరాశ కలుగుతుంది తప్ప అంచనాలకు తగ్గటయితే లేదు.
This post was last modified on June 25, 2023 12:12 am
దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…