ఎంత అయిపోయిందనుకుంటున్నా ఆదిపురుష్ తాలూకు ముచ్చట్లు ఏదో ఒక రూపంలో చర్చలోకి వస్తూనే ఉన్నాయి. మొదటి మూడు రోజుల భారీ వసూళ్ల తర్వాత హఠాత్తుగా డెడ్ స్లీప్ లోకి వెళ్ళిపోయిన ఈ రామాయణ గాథ మీద వివాదాలు కాస్త చల్లబడ్డాయి కానీ కలెక్షన్లు మాత్రం వారాంతంలో కూడా భారీగా నమోదయ్యే సూచనలు కనిపించడం లేదు. ఇదిలా ఉండగా అందరి విమర్శలకు ప్రధాన టార్గెట్ గా మారిన రావణాసురుడి పాత్ర చిత్రణ, సైఫ్ అలీఖాన్ పోషించిన తీరు పట్ల ఎంత నెగటివిటీ వచ్చిందో చూశాం. దీనికి జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న కనెక్షన్ ని ఫ్యాన్స్ తవ్వకాల్లో బయటికి తీశారు
2017లో రిలీజైన జై లవకుశ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తారక్ అన్న మాటలు ఇప్పుడు వీడియో రూపంలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న రావణ క్యారెక్టర్ ని పోషించేందుకు ఆనంద్ నీలకంఠ రాసిన అసుర పుస్తకం చదివాడట. అందులో 18 లోకాలకు రాజుగా ఉండటంతో అసుర చక్రవర్తిగా పేరుగాంచిన రావణబ్రహ్మకున్న విశిష్ట లక్షణాలు అందులో తెలుసుకున్నాడట. ఈ లక్షణం వల్లే యుద్దానికి ముందు రాముడు సైతం రావణుడు ఇంత గొప్పవాడు ఇలా అయ్యాడేననే రీతిలో పద్యం పాడినట్టు అందులో వివరించారట.
ఒక కమర్షియల్ మూవీకే జూనియర్ ఇంత హోమ్ వర్క్ చేసినప్పుడు మరి ఆదిపురుష్ లాంటి ఎపిక్ గ్రాండియర్ కోసం ఓం రౌత్ ఇంకెంత చేసుండాలనేది ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్. అసలు రామాయణం పుస్తకమైనా చదవకుండా కేవలం తనకున్న జ్ఞానంతోనే ఆదిపురుష్ ని తీసి చెడగొట్టాడని వాళ్ళ కంప్లయింట్. ఏది ఎలా ఉన్నా ఇదంతా జరిగిపోయింది. ఎవరూ మార్చలేరు. కాకపోతే ఇలాంటివి తీసేటప్పుడు ఎంత హోమ్ వర్క్ అవసరమో గుర్తించాల్సిన అవసరమైతే చాలా ఉంది. జైలవకుశ కోసం తారక్ అన్న మాటలు ఇప్పుడు వైరల్ కావడం కన్నా ఉదాహరణ ఇంకేం కావాలి
This post was last modified on June 24, 2023 5:00 pm
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…