ఈ వారం బాక్సాఫీస్ చిన్న సినిమాల తాకిడితో వ్యాపారం లేని రైతు బజార్ ని తలపించింది. వాటిలో 1920 హారర్స్ అఫ్ ది హార్ట్స్ ఒకటి. బాలీవుడ్ మూవీ అయినా హిందీతో పాటు తెలుగు డబ్బింగ్ కూడా రిలీజ్ చేశారు. మహేష్ భట్ బృందం సృష్టించిన రాజ్ సిరీస్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సీరియస్ దెయ్యాల కథలతో కొత్త ట్రెండ్ సృష్టించిన ఘనత వీళ్లది. 1920 టైటిల్ తో ఇప్పటి దాకా నాలుగు తీస్తే అవన్నీ కమర్షియల్ గా బాగానే సక్సెస్ అయ్యాయి. ఇప్పుడిది ఐదోది. ఉయ్యాలా జంపాల ఫేమ్ అవికా గోర్ ప్రధాన పాత్ర కావడంతో మన ఆడియన్స్ లోనూ కొంత ఆసక్తి లేకపోలేదు
తండ్రి చావుకు తల్లి రాధిక(బర్కా బిస్ట్) కారణమని గుర్తించిన మేఘన(అవికా గోర్)దానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఫిక్సవుతుంది. ప్రియుడు అర్జున్ (ధనిష్ పండోర్)కు దూరమయ్యే పరిస్థితి వచ్చినా వెనక్కు తగ్గదు. రాధిక అప్పటికే శంతను(రాహుల్ దేవ్)ని రెండో పెళ్లి చేసుకుందని తెలుసుకుంటుంది. దీంతో రివెంజ్ కోసం నాన్న ఆత్మను సాయం కోరుతుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలు అసలు స్టోరీ. మాములుగా దెయ్యం సినిమా చూడాలంటే భయం ఉండకూడదు. కానీ ఈ 1920ని థియేటర్ లో చివరి దాకా తట్టుకోవాలంటే బోలెడంత గుండె నిబ్బరం కావాలి.
హారర్ కంటే ఎక్కువ దర్శకుడు కృష్ణ భట్ తన టేకింగ్ తో వణికించాడు, కాదు విసిగించాడు. చీప్ గ్రాఫిక్స్ తో పాటు జుగుప్స కలిగించే విజువల్స్ నింపేసి ఠారెత్తించాడు. అవికా గోర్ ఎలాంటి మొహమాటాలు లేకుండా పడక గది సన్నివేశాలు, లిప్ లాక్ సీన్లు పండించేసింది. ట్విస్టులు సులభంగా ఊహించేలా పెట్టడమే కాకుండా హారర్ ఎపిసోడ్లను కనీసం జర్క్ ఇచ్చేలా డిజైన్ చేసుకోలేదు. కళ్ళు మూసుకోవాలనిపించే వికృత దృశ్యాలకు మాత్రం కొదవ లేదు. ఎప్పుడో డ్రై అయిపోయిన 1920 థీమ్ ని పట్టుకుని ఇంకా వేలాడుతున్న భట్ టీమ్ కి దండం పెట్టడం తప్ప ఆశించడానికి ఏమీ లేనంత గొప్పగా తీర్చిదిద్దారు.
This post was last modified on June 24, 2023 2:53 pm
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…