Movie News

సంజుకు క్యాన్సర్.. కేజీఎఫ్ సంగతేంటి?

కరోనా టైంలో అనేక షాకులు తింది బాలీవుడ్. ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్ లాంటి దిగ్గజ నటులు అనారోగ్యంతో ఒకరి తర్వాత ఒకరు కాలం చేశారు. కరోనా వల్ల సంగీత దర్శకుడు వాజిద్ ఖాన్ ప్రాణాలు వదిలాడు. సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్ అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఇంకా మరికొన్ని విషాదాలు చోటు చేసుకున్నాయి. అమితాబ్ బచ్చన్ కరోనా బారిన పడటమూ ఆందోళన కలిగించింది. అదృష్టవశాత్తూ ఆయన కోలుకుని మామూలు మనిషి అయ్యారు.

కానీ ఇంతలో సంజయ్ దత్ ఆసుపత్రి పాలవడం ఆందోళన రేకెత్తించింది. ఆయనకు కరోనా లేదని తేలడంతో హమ్మయ్య అనుకున్నారంతా. కానీ తర్వాత వచ్చిన అప్ డేట్ చూసి కరోనా ఉన్నా పోయేదే అనిపిస్తోంది.

సంజయ్ దత్ ఊపిరి తిత్తుల క్యాన్సర్‌తో బాధ పడుతున్నట్లు వెల్లడైంది. అది కూడా అడ్వాన్స్ (మూడో దశ) స్టేజ్. అంటే సంజు తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లే. ఈ దశలో ఊపిరి తిత్తుల క్యాన్సర్ నుంచి కోలుకుని మామూలు మనిషి కావడం అంత తేలిక కాదు. ఆయన వెంటనే అమెరికాకు పయనమవుతున్నారు. మళ్లీ ఎప్పటికి కోలుకుంటాడో.. సంజు భవిష్యత్ ఏంటో తెలియట్లేదు. దీంతో ఆయన నటిస్తున్న, నటించబోయే సినిమాలన్నీ సందిగ్ధంలో పడిపోయాయి.

ఇంతకుముందు సంజు జైలుపాలైనపుడు ఇలాగే చాలా సినిమాలు అన్యాయం అయిపోయాయి. నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లింది. ఇప్పుడు దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘కేజీఎఫ్-చాప్టర్ 2’లో సంజు విలన్‌గా చేస్తున్నాడు. ఆయన పాత్ర చిత్రీకరణ ఇంకా కొంచెం మిగిలి ఉంది. ఇది కాక బాలీవుడ్లో మూణ్నాలుగు సినిమాల్లో సంజు నటిస్తున్నాడు. వీటి పరిస్థితి ఏమవుతుందో చూడాలి మరి.

This post was last modified on August 12, 2020 10:07 pm

Share

Recent Posts

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

42 minutes ago

మతిపోగొడుతున్న వారణాసి లెక్కలు

సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…

1 hour ago

కళ్యాణ్ గుండె ధైర్యం గట్టిదే

అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…

1 hour ago

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

3 hours ago

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…

4 hours ago

ఐకానిక్ షోకు తెర‌… చివ‌రి సీజ‌న్లో అల్లు అర్జున్‌?

ఇండియాలో వివిధ భాష‌ల్లో అనేక టాక్ షోలు ఉన్నాయి. అందులో అత్యంత పాపుల‌ర్ ఏది అంటే బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత…

4 hours ago