తెలుగు తమిళ సినిమాలకు సంబందించిన అతి పెద్ద సీనియర్ స్టార్లు చిరంజీవి, రజనీకాంత్ ఆగస్ట్ లో బాక్సాఫీస్ వద్ద ఒకేసారి తలపడటం ఆసక్తిని పెంచుతోంది. ఆగస్ట్ 10న జైలర్ రిలీజ్ కానుండగా కేవలం ఒక్క రోజు గ్యాప్ తో 11న భోళా శంకర్ దిగుతాడు. ఇప్పటిదాకా వీటి ప్రమోషన్లు పెద్దగా ఊపందుకోలేదు. మెగా మూవీ నుంచి వచ్చిన పోస్టర్లు, లిరికల్ వీడియో, టీజర్ అప్ డేట్ అన్నింటిలోనూ ఒకే కాస్ట్యూమ్ తో ఉన్న భోళా శంకర్ ని చూపించడం తప్ప ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే స్టఫ్ రాలేదు. అసలే వేదాళం రీమేకనే టెన్షన్ ఫ్యాన్స్ లో ముందు నుంచీ ఉంది.
దానికి తోడు మెహర్ రమేష్ ట్రాక్ రికార్డు, పదేళ్ల తర్వాత డైరెక్షన్ చేయడం ఇవన్నీ ప్రతికూలంగానే ఉన్నాయి. ఏదో సర్ప్రైజ్ ఇస్తే తప్ప కదలిక రాదు. జూన్ 24 టీజర్ తో కొంత క్లారిటీ రావొచ్చు. ఇక జైలర్ కూడా సైలెంట్ గానే ఉన్నాడు. ఎప్పుడో దసరాకు వచ్చే భగవంత్ కేసరి, లియో, టైగర్ నాగేశ్వరరావుల మీద ఉన్న బజ్ రజనికి సగం కూడా కనిపించడం లేదు. ఓవర్సీస్ హక్కులు ముప్పై రెండు కోట్లకు అమ్మారనే వార్త చక్కర్లు కొడుతోంది కానీ అదెంత వరకు నిజమో తెలియదు. టాలీవుడ్ మార్కెట్ ఎప్పుడో తగ్గిన రజని నిర్మాతలు ఈసారైనా సీరియస్ గా ప్రమోషన్లు చేస్తారేమో చూడాలి
అసలు గండం వేరే ఉంది. అదే సమయంలో వస్తున్న యానిమల్ ని మాత్రం తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎంత రన్బీర్ కపూర్ హీరో అయినా సరే అన్ని భాషలకు కనెక్ట్ అయ్యే మాస్ గ్యాంగ్ స్టర్ కంటెంట్ తో దర్శకుడు సందీప్ వంగా చాలా బాగా తెరకెక్కించాడని ఇన్ సైడ్ టాక్ ఉంది. ట్రైలర్ వచ్చాక లెక్కలు అంచనాలు అమాంతం మారిపోవచ్చు. ఇదొక్కటే కాదు సన్నీ డియోల్ గదర్ 2ని లైట్ తీసుకున్నా ప్రమాదమే. సో చిరు రజనిలు పర్సనల్ ఇంటరెస్ట్ తీసుకుని నిర్మాణ సంస్థలు పబ్లిసిటీ వేగం పెంచేలా ఒత్తిడి చేస్తే తప్ప పోటీని ఎదురుకోవడం అంత సులభంగా ఉండదు
This post was last modified on June 23, 2023 8:14 am
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…