మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్ చరమాంకంలో చేస్తున్న గ్లామర్ షో.. అలాగే తన వ్యక్తిగత విషయాల కారణంగా సోషల్ మీడియాలో బాగా హైలైట్ అవుతోంది. ‘జీ కర్దా’ అనే కొత్త బెబ్ సిరీస్‌లో తమన్నా బోల్డ్ యాక్ట్స్ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. కెరీర్లో ఏ సినిమాలోనూ కనిపించనంత బోల్డ్‌గా ఈ సిరీస్‌లో కనిపించింది తమ్మూ. ఇంటిమేట్ సీన్ల తాలూకు వీడియోలు కొన్ని రోజులుగా ఇంటర్నెట్‌ను ముంచెత్తుతున్నాయి.
అదే సమయంలో నటుడు విజయ్ వర్మతో ఆమె రిలేషన్‌షిప్ గురించి కూడా మీడియాలో ఒకటే వార్తలు వస్తున్నాయి. కానీ తమన్నా అనుభవించిన స్టార్ స్టేటస్ ప్రకారం చూస్తే.. విజయ్ ఆమె ముందు చిన్నగా కనిపిస్తున్నాడు. అతను ఎక్కువగా క్యారెక్టర్, విలన్ రోల్సే చేస్తుంటాడు. అందుకే తనతో తమన్నా ప్రేమాయణం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది.
విజయ్‌తో తన బంధం గురించి తమన్నా పూర్తిగా ఓపెన్ కాలేదు. అలా అని ఖండించలేదు. ఐతే వీళ్లిద్దరి మధ్య నిజంగా రిలేషన్‌షిప్ ఉందా.. లేక మీడియా దృష్టిని ఆకర్షించేందుకు.. తాము కలిసి నటించిన ‘లస్ట్ స్టోరీస్-2’ ప్రమోషన్ కోసం గిమ్మిక్ చేస్తున్నారా అన్న సందేహాలు కూడా బాలీవుడ్ మీడియా సర్కిల్స్‌లో వ్యక్తమవుతున్నాయి. తమన్నా కొంత కాలంగా నెట్ ఫ్లిక్స్ వారి ‘లస్ట్ స్టోరీస్-2’ కోసం కలిసి పని చేస్తున్నారు. ఆ సమయంలోనే బయట కూడా కలిసి కనిపించారు.
తాజాగా రిలీజైన ‘లస్ట్ స్టోరీస్-2’ ట్రైలర్ చూస్తే.. తమన్నా-విజయ్‌ల ఎపిసోడే హైలైట్ అయ్యేలా ఉంది. ఒకప్పటి తన ప్రేమికుడితో.. పెళ్లయ్యాక మళ్లీ సంబంధం పెట్టుకునే అమ్మాయి స్టోరీ ఇది. తమన్నా ఈ షోలో సూపర్ హాట్‌గా కనిపించబోతోందని.. విజయ్, తమ్మూల కెమిస్ట్రీ హైలైట్ కాబోతోందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ షోను హిట్ చేయడానికే తమన్నా, విజయ్ లవ్ డ్రామా ఆడుతున్నారని.. తర్వాత ఎవరి దారి వారు చూసుకుంటారని.. ఒకవేళ ఇద్దరి మధ్య కొంత ఆకర్షణ ఉన్నప్పటికీ వీరి నేపథ్యాల ప్రకారం చూస్తే ఈ బంధం పెళ్లి వైపు వెళ్లకపోవచ్చనే సందేహాలు బాలీవుడ్ సర్కిల్స్‌లో వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on June 22, 2023 9:17 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…