కెజిఎఫ్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ రేంజ్ ప్యాన్ ఇండియాని మించి వెళ్ళిపోయింది. రెండో సినిమాకే ఈ స్థాయి ఫేమ్ తెచ్చుకోవడం చాలా అరుదు. ప్రస్తుతం సలార్ మీద సీరియస్ గా వర్క్ చేస్తున్న ఈ కల్ట్ డైరెక్టర్ కి హోంబాలే ఫిలిమ్స్ అంటే స్వంత బ్యానర్ కన్నా ఎక్కువ. తనను నమ్మి కెజిఎఫ్ మీద అన్ని వందల కోట్లు ఖర్చు పెట్టే సాహసం చేసినందుకు ఇప్పట్లో ఆ సంస్థను వీడేలా లేడు. ఆ అనుబంధం ఎంతగా అంటే ఒక స్ట్రెయిట్ తెలుగు మూవీకి స్క్రీన్ ప్లే సమకూర్చేటంత. ఒక పక్క చాలా బిజీగా ఉన్నప్పటికీ ఈ ప్రొడక్షన్ హౌస్ కి టాలీవుడ్ డెబ్యూ కావడంతో అన్నీ చూసుకుంటున్నాడు
శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో హోంబాలే ఒక స్ట్రెయిట్ ఫిలిం నిర్మిస్తోంది. కొంత భాగం షూట్ కూడా పూర్తయ్యింది. ఇతని గత చిత్రాలు సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు, అనుభవించు రాజా రెండూ రాజ్ తరుణ్ తో చేసినవే. ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయి. అయినా ఎన్నో బ్లాక్ బస్టర్ల రచనలో అనుభవమున్న గవిరెడ్డి చెప్పిన ఒక కథ ప్రశాంత్ నీల్ కి నచ్చడంతో ఆయనే కథనం సమకూర్చి మరీ కాంబినేషన్ సెట్ చేశారట. అటవీ నేపథ్యంలో సాగే ఈ డిఫరెంట్ థ్రిల్లర్ లో ఓ ప్రముఖ హీరోయిన్ కీలక పాత్ర పోషించనున్నట్టు సమాచారం . ఆర్టిస్టుని లాక్ చేయలేదు.
ఇప్పటిదాకా ఎంచుకున్న క్యాస్టింగ్ లో ఆదర్శ్ బాలకృష్ణ, హరీష్ ఉత్తమన్, బెనర్జీ, మకరంద్ దేశ్ పాండే తదితరులు ఉన్నాయి. వీళ్ళ మీద కొంత భాగం చిత్రీకరణ పాడేరు, చింతపల్లి తదితర ప్రాంతాల్లో చేశారు. ప్రశాంత్ నీల్ స్క్రీన్ ప్లే అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆస్థాన సంగీత దర్శకుడు రవి బస్రూర్ దీనికీ మ్యూజిక్ ఇవ్వబోతున్నట్టు టాక్. ప్రస్తుతం చిన్న బడ్జెట్ తో మొదలుపెట్టి క్రమంగా భారీ చిత్రాలకు ప్లాన్ చేస్తున్నారు. సలార్ తెలుగు సినిమానే అయినా హోంబాలే మాత్రం ఫస్ట్ వెంచర్ గా గవిరెడ్డిదే ప్రమోట్ చేసే అవకాశాలున్నాయి
This post was last modified on June 22, 2023 6:17 pm
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…