మామూలుగా కూల్‍గా వుండే సుకుమార్ ఇటీవల చాలా ఫస్ట్రేషన్‍లో కనిపిస్తున్నాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతే మరి… రంగస్థలం లాంటి బ్లాక్‍బస్టర్ ఇచ్చిన తర్వాత అకారణంగా ఒక దర్శకుడు రెండేళ్లు వృధాగా సమయం గడపాల్సి వస్తే ఆమాత్రం విసుగు, కోపం సహజం. మహేష్ కోసమని కథ రాస్తూ ఏడాదికి పైగా సమయాన్ని సుకుమార్ స్పెండ్ చేసాడు.
కానీ సుకుమార్‍ని వెయిటింగ్‍లో పెట్టి అనిల్ రావిపూడి చిత్రం చేయడానికి మహేష్ డిసైడ్ అవడంతో రాత్రికి రాత్రి సుకుమార్ అదే కథ అల్లు అర్జున్‍కి చెప్పి ఓకే చేయించుకున్నాడు. అయితే అక్కడే ఒక పొరపాటు చేసాడు. ఆల్రెడీ త్రివిక్రమ్ సినిమా కమిట్ అయిన అల్లు అర్జున్ వెంటనే సుకుమార్‍తో సినిమా చేసే పరిస్థితి లేదు. దాంతో సుకుమార్ అక్కడే ఒక ఏడాది ఎదురు చూడాల్సి వచ్చింది. తీరా సినిమా మొదలవుతుందనే సరికి లాక్‍డౌన్‍తో మరింత టైమ్ వేస్ట్ అవుతోంది. దీంతో సుకుమార్‍కి అసహనం పెరిగిపోతోందట.
పుష్ప షూటింగ్ ఈ ఏడాది చివరకు మొదలవుతుందని అనుకున్నా కానీ తనకు షూటింగ్ కంప్లీట్ చేయడానికి ఏడాది సమయం పడుతుంది. అంటే 2021 సంక్రాంతికి గానీ రిలీజ్ ప్లాన్ చేసుకోలేరు. దర్శకుడిగా సినిమాకు పది కోట్లకు పైగా పారితోషికం తీసుకునే సుకుమార్‍కి రెండేళ్లు వృధా పోవడమంటే చాలా నష్టం. ఒక్కోసారి హీరోల కోసం ఎదురు చూడడం కంటే ఎవరు రెడీగా వుంటే వారితో సినిమా చేసేయడం ఉత్తమం.
This post was last modified on August 12, 2020 10:53 am
దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…