జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న దేవర షూటింగ్ స్పీడందుకుంది. ప్యాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. విలన్ గా చేస్తున్న సైఫ్ అలీ ఖాన్ కు సైతం ఇదే తొలి టాలీవుడ్ డెబ్యూ. ఆదిపురుష్ లో చేసినా అది హిందీ చిత్రం కాబట్టి కౌంట్ లోకి రాదు. అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్న దేవరకు సంబంధించి ఇప్పటిదాకా ముప్పై శాతానికి పైగానే చిత్రీకరణ పూర్తయినట్టుగా ఇన్ సైడ్ టాక్.
తాజాగా ఈ క్యాస్టింగ్ కి మరో ఆకర్షణ తోడైంది. దసరా విలన్ షైన్ టామ్ చాకో దేవరలో చేరాడు. ఇది తనకు మూడో తెలుగు సినిమా. నాగ శౌర్య రంగబలో ప్రధాన పాత్ర పోషించాడు. దేవరలో తానున్న విషయం స్వయంగా సోషల్ మీడియా పోస్టుల ద్వారా షేర్ చేసుకున్న షైన్ టామ్ చాకో మెల్లగా ఇక్కడ మంచి అవకాశాలు పడుతున్నాడు. ప్రకాష్ రాజ్, రావు రమేష్, సంపత్ తదితరులు రొటీన్ అయిపోయాక సరైన ప్రతినాయకులను ఎంచుకోవడం డైరెక్టర్లకు సవాల్ గా మారింది. అందుకే సలార్ కోసం పృథ్విరాజ్ ని తీసుకొస్తే దేవర కోసం సైఫ్, టామ్ చాకోలు తోడయ్యారు.
వచ్చే ఏడాది ఏప్రిల్ 5 విడుదల కాబోతున్న దేవర షూట్ ని వీలైనంత వరకు నవంబర్ కల్లా పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం ఇచ్చి, అనిరుద్ రవిచందర్ రీ రికార్డింగ్ కి తగినంత టైం దక్కేలా పక్కా ప్రణాళికతో కొరటాల రెడీగా ఉన్నారు. చివరి నిమిషం దాకా హడావిడి పడి అవుట్ ఫుట్ ని దెబ్బ తీసుకోవడం కన్నా ముందస్తుగా పూర్తి చేసి ప్రమోషన్లకు రెడీ అయ్యేలా సెట్ చేస్తున్నారు. అరవింద సమేత వీరరాఘవ తర్వాత తారక్ సోలో హీరోగా చేస్తున్న మూవీ కావడంతో ఫ్యాన్స్ అంచనాలు ఆకాశమే హద్దుగా ఉన్నాయి
This post was last modified on June 21, 2023 11:29 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…