ఆదిపురుష్ అంచనాలకు మించి మొదటి మూడు రోజులు ఎలాంటి వసూళ్ల సునామి సృష్టించిందో అంతకు మించి సోమవారం నుంచి దారుణమైన డ్రాప్ తో బయ్యర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. వీకెండ్ వరకు అడ్వాన్స్ బుకింగ్స్ తో గట్టెక్కిన వైనం స్పష్టంగా కనిపిస్తోంది. నిన్న పరిస్థితి ఇంకా కిందకు వెళ్లిపోయింది. తెలుగు రాష్ట్రాల వరకు అయిదు కోట్లు గ్రాస్ దాటడమే కష్టమేనేలా ఫిగర్లు నమోదయ్యాయి. చాలా కేంద్రాల్లో షోలు అధికంగా ప్లాన్ చేసుకున్న మల్టీప్లెక్సుల్లో ప్రేక్షకులను ఒప్పించి ఒకేదాంట్లో సర్దుబాటు చేయడానికి కొన్ని చోట్ల యాజమాన్యాలు ఇబ్బంది పడిన వైనం కనిపించింది.
తెలంగాణలో కొంత వరకు నయమనుకున్నా ఏపీలో పది రోజుల వరకు టికెట్ రేట్ల హైక్ ఇవ్వడంతో దానికి తగ్గట్టుగానే ఆన్ లైన్ బుకింగ్ సెట్ చేసుకున్నారు. తీరా టాక్ బయటికి వచ్చాక తగ్గించే మార్గం ఉన్నప్పటికీ పలు సెంటర్స్ లో ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం ప్రేక్షకులను రాకుండా అడ్డుపడుతోంది. పైగా సోషల్ మీడియా నెగటివిటీ ఎంతకీ ఆగడం లేదు. కొన్ని వివాదాలు చెలరేగుతున్నా అవేవి జనాన్ని హాళ్ల దాకా రప్పించలేకపోతున్నాయి. ఈ వారం చెప్పుకోదగ్గ రిలీజులు లేకపోవడం ఒక్కటే ఆదిపురుష్ కు సానుకూలాంశం. ఎంత మేరకు ప్లస్ అవుతుందో చూడాలి
తెలుగు వెర్షన్ హక్కులు కొన్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఇంకా భారీ మొత్తం రావాల్సి ఉంటుంది. కానీ బాక్సాఫీస్ దానికి అనుగుణంగా కనిపించడం లేదు. వరల్డ్ వైడ్ బిజినెస్ చూసుకుంటే ఇంకో 75 కోట్ల దాకా వస్తేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది. స్కూల్ పిల్లలకు, అనాధలకు స్పెషల్ గా ఉచిత షోలు వేస్తున్న దాఖలాలు ఉన్నా వాటి కంట్రిబ్యూషన్ వల్ల పెద్దగా మార్పేమీ ఉండదు. ఫైనల్ గా ఆదిపురుష్ ఫ్లాప్ నుంచి డిజాస్టర్ కు మధ్యలో ఎక్కడో ఒక చోట నిలవడం ఖాయమే. దర్శకుడు ఓం రౌత్, రచయిత మనోజ్ ల స్టేట్ మెంట్లు అంతకంత నెగటివిటీని పెంచడం చివరి ట్విస్టు
This post was last modified on June 21, 2023 12:50 pm
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…