పుష్ప విలన్ సినిమాకు నో పబ్లిసిటీ

కెజిఎఫ్ లాంటి ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్ ఇచ్చిన హోంబాలే ఫిలింస్ కి ఇప్పుడు నిర్మాణంలో ఉన్నవన్నీ భారీ ప్యాన్ ఇండియాలే. మధ్యలో ఒకటి రెండు బడ్జెట్ ప్రయోగాలు చేస్తున్నారు కానీ ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న మూవీ కావడంతో పాటు ప్రభాస్ హీరో అనే అంశం సలార్ మీద అంచనాలను ఎక్కడికో తీసుకెళ్తోంది. ఈ బ్యానర్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ ధూమం. ఈ జూన్ 23 మల్టీ లాంగ్వేజెస్ లో రిలీజ్ కానుంది. అయితే ఇప్పటిదాకా కనీసం ప్రమోషన్ మొదలుపెట్టలేదు. టీమ్ ని తీసుకొచ్చి చేయించే పబ్లిసిటీ హడావుడి ఊసే లేదు.

కేవలం నాలుగు రోజులే ఉండటంతో తెలుగు డబ్బింగ్ మలయాళంతో పాటు ఒకే రోజు వస్తుందా రాదానే అనుమానాలు నెలకొన్నాయి. ఇదే హోంబాలీ నుంచి వచ్చిన కాంతార రెండు వారాలు ఆలస్యంగా అనువాదం రిలీజై అద్భుత విజయం అందుకుంది. దీనికీ అదే ఫార్ములా వాడతారానే అనుమానం లేకపోలేదు. కానీ బుక్ మై షో చూస్తే తెలుగు వెర్షన్ కు సంబంధించిన టికెట్లు అందుబాటులో ఉంచేశారు కాబట్టి డౌట్ అక్కర్లేదు. అయితే ఇంత తక్కువ బజ్ తో ధూమంని తీసుకురావడం వల్ల ఓపెనింగ్స్ ని ఆశించలేం. కేవలం మౌత్ టాక్ ని నమ్ముకోవాల్సిందే

ధూమంకి పవన్ కుమార్ దర్శకుడు. లూసియా లాంటి విలక్షణ చిత్రాలతో ఆడియన్స్ ని మెప్పించాడు. సమంతా వెర్షన్ ఇక్కడ పెద్దగా ఆడలేదు కానీ కన్నడలో యుటర్న్ చాలా పెద్ద హిట్టు. తర్వాత పునీత్ రాజ్ కుమార్ తో ఈ ధూమంని ప్లాన్ చేసుకుంటే ఆయన హఠాత్తుగా కాలం చేయడంతో ఇది కాస్తా ఫహద్ ఫాసిల్ కు చేరిపోయింది. పుష్ప విలన్ గా మన పబ్లిక్ లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫహద్ ఫాసిల్ కు ఇప్పటిదాకా హీరోగా స్ట్రెయిట్ తెలుగు థియేట్రికల్ రిలీజ్ లేదు. మరి ధూమంతో సరైన ఛాన్స్ దక్కింది కానీ కెజిఎఫ్ ప్రొడ్యూసర్ల మౌనం బజ్ ని పెంచడం లేదు.