మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు తండ్రి హోదా వచ్చేసింది. ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్టు ఇవాళ ఉదయం అపోలో హాస్పిటల్ అధికారికంగా ప్రకటించడంతో అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వారసుడు వస్తాడేమోనని ఫ్యాన్స్ కొందరు సోషల్ మీడియాలో జోస్యం చెప్పారు కానీ ఫైనల్ గా పాపే పుట్టింది. ఆసుపత్రి దగ్గరకు అభిమానులు చేరుకొని అప్పుడే సందడి మొదలుపెట్టారు. వాళ్ళ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు న్యూస్ ఛానల్స్ ఏకంగా లైవ్ ప్రోగ్రాంస్ నిర్వహించడం కొసమెరుపు. ఉదయం నుంచి ఇవి కొనసాగుతూనే ఉన్నాయి
చిరంజీవికి తొలి సంతానం అమ్మాయి అయినట్టుగానే ఇప్పుడు చరణ్ కు సైతం అదే రిపీట్ అయ్యింది. ఫస్ట్ గర్ల్ బేబీ క్లబ్బులో చాలా స్టార్ హీరోలు ఉన్నారు. వెంకటేష్, రజనీకాంత్, మంచు విష్ణు, కమల్ హాసన్, అల్లరి నరేష్, రాజశేఖర్, రవితేజ, అజయ్ దేవగన్, సైఫ్ అలీ ఖాన్, ఐశ్వర్య రాయ్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాండంత ఉంది. పాపా బాబా అనే భేదం సెలబ్రిటీ ఫ్యామిలీస్ లో ఉండదు. ఎటొచ్చి నట వారసత్వ కోణంలో అభిమానులు బుల్లి హీరోని ఆశించడం సహజం. అయినా నెక్స్ట్ వచ్చే సంతానంతో ఆ కోరిక తీరొచ్చు కాబట్టి అదేమీ సమస్య కాదు.
సోషల్ మీడియాలో అభినందనల పర్వం కొనసాగుతోంది. తాతయ్య చిరంజీవి మనవరాలికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇవాళ మెగా ఫ్యామిలీతో పాటు అల్లు, ఉపాసన వైపు నుంచి బంధువులు మిత్రుల తాకిడితో అపోలో కిక్కిరిసిపోనుంది. దానికి తగ్గట్టే భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఫాన్స్ ఉత్సాహం తట్టుకోలేక అధిక సంఖ్యలో విచ్చేయడంతో వాళ్ళను కంట్రోల్ చేయడంలో సెక్యూరిటీ బిజీగా ఉంది. తాత చిరంజీవి, చినతాత పవన్ కళ్యాణ్, నాన్న రామ్ చరణ్, అమ్మ ఉపాసన, మావయ్య అల్లు అర్జున్ ఈ పేర్లను చూస్తుంటే బుల్లి ప్రిన్సెస్ ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చేసింది
This post was last modified on October 8, 2023 4:39 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…