మేమసలు తీసింది రామాయణమే కాదు కేవలం స్ఫూర్తి మాత్రమే తీసుకున్నామని ఆదిపురుష్ రచయిత ఇచ్చిన వీడియో బైట్ సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితం ఇతనే స్వయంగా మేము పురాణగాథని ఎలాంటి వక్రీకరణలు లేకుండా తీస్తున్నామని చెప్పడాన్ని నెటిజెన్లు తవ్వి తీసి మరీ చూపించారు. గతంలో దర్శకుడు ఓం రౌత్ హనుమంతుడి గురించి వ్యంగ్యంగా వేసిన ట్వీట్లు, షారుఖ్ ఖాన్ రా వన్ సినిమా మీద సెటైర్లు బయటికి వచ్చాయి. అవన్నీ డిలీట్ చేయడం అయినా స్క్రీన్ షాట్లు సేవ్ కావడం వేరే సంగతి
తాజాగా హైదరాబాద్ లో జరిగిన సక్సెస్ మీట్లో ఆదిపురుష్ తెలుగు వెర్షన్ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు మాట్లాడుతూ నిజంగా ఎవరూ చూడని రావణాసురుడిని న్యూ జనరేషన్ కోసం అలా చూపించామని, రాముడు ఫలానా రూపంలో ఉంటాడని తెలియని ఇరవై ఏళ్ళ వయసులోపు ఉన్న టీనేజర్లు, పిల్లలు అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అక్కడ ముంబై వాళ్లేమో ఇది రామాయణం కాదంటూంటే ఇక్కడేమో రాముడి కథని కొత్తగా చూపించామని చెబుతున్నారు, సరే సక్సెస్ మీట్ అన్నాక ఇలాంటివి మాములే కానీ ఒకే సినిమాకు సంబంధించి గందరగోళ స్టేట్ మెంట్లు రావడం విచిత్రం
ఈ మధ్యకాలంలో ఏ సినిమాకూ ఇలా జరగలేదన్నది వాస్తవం. మరోపక్క లక్నో, ముంబై లాంటి ప్రాంతాల్లో ఆదిపురుష్ ప్రదర్శనలు ఆపాలని నిరసనకారులు పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేస్తున్నారు. ముంబైలోని ఒక థియేటర్ లో షో అర్ధాంతరంగా ఆపేయాలని ఓ వ్యక్తి నానా రచ్చ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంత జరుగుతున్నా ఆదిపురుష్ లో నటించిన వారెవరూ బయటకు రాకపోవడం విచిత్రం. టీవీ ఛానల్స్ ఇంటర్వ్యూలు అడుగుతున్నా దాటవేస్తున్నారట. ఏం మాట్లాడితే ఏం వివాదం ముంచుకొస్తుందోనని గమ్మున ఉన్నారట. ఇదీ మంచిదే
This post was last modified on June 19, 2023 8:22 pm
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…