Movie News

కాజల్‌‌ ఫ్యాన్స్ తట్టుకోగలరా?

టాలీవుడ్లో గత రెండు దశాబ్దాల్లో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించి.. టాప్ స్టార్లందరితోనూ భారీ సినిమాలు చేసిన కథానాయికల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. ఆమె గ్లామర్‌కు కేరాఫ్ అడ్రస్‌ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మిగతా హీరోయిన్లతో పోలిస్తే ఆమె నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు పెద్దగా చేయలేదు. అలాగే ఆమె చేసినవన్నీ దాదాపుగా సాఫ్ట్ రోల్సే.

మాస్ పాత్రలు కెరీర్లో దాదాపుగా లేవనే చెప్పాలి. వీర లెవెల్లో ఫైట్లు.. విన్యాసాలు చేయడాల్లాంటివి ఆమె ఎప్పుడూ చేయలేదు. అనుష్క, నయనతార, సమంతల మాదిరి లేడీ ఓరియెంటెడ్ రోల్స్‌ కూడా కాజల్ పెద్దగా చేయలేదు. గత కొన్నేళ్లలో ఆ తరహా సినిమాలు కొన్ని చేసినా అవి వర్కవుట్ కాలేదు. కాజల్‌కు అవి సెట్ కాలేదు. తమిళంలో ఒక పోలీస్ సినిమా చేసినా.. అది తుస్సుమనిపించింది. బేసిగ్గా కాజల్‌కు మాస్, హీరోయిక్ ఇమేజ్ లేకపోవడం ఇందుకు కారణం.

కాజల్‌ను తన అభిమానులు గ్లామర్ క్వీన్‌గానే చూస్తారు. అలాంటి హీరోయిన్లు వీర లెవెల్లో ఫైట్లు, మాస్ చేస్తే సెట్ కాదు. కానీ ఇప్పుడు ‘సత్యభామ’ అనే సినిమాలో కాజల్ ఇమేజ్ మేకోవర్ కోసం ట్రై చేస్తున్నట్లు అనిపిస్తోంది. అఖిల్ డేగల అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ చిత్రానికి గూఢచారి, మేజర్ చిత్రాల దర్శకుడు శశికిరణ్ తిక్క స్క్రీన్ ప్లే సమకూర్చాడు. ఈ టీజర్ అయితే ఆసక్తికరంగా ఉంది కానీ.. కాజల్ అంత వయొలెంట్‌గా కనిపించడం అందరికీ పెద్ద షాక్.

సాఫ్ట్ ఇమేజ్‌ ఉన్న కాజల్.. వయొలెంట్ పోలీసాఫీసర్‌గా అంటే కొంచెం జీర్ణించుకోవడం కష్టంగానే ఉంది అభిమానులకు. ఇక్కడ ఆమెకున్న గ్లామర్ ఇమేజ్ అడ్డంకిగా కనిపిస్తోంది. ఐతే తొలిసారి ఇలాంటి రోల్స్ చేసినపుడు కొంచెం ఇబ్బందిగా అనిపించినా.. సినిమా బాగుండి, ఆ క్యారెక్టర్‌ను ఒక కన్విక్షన్‌తో చేస్తే జనాలు అలవాటు పడతారు. ఆదరిస్తారు. మరి ‘సత్యభామ’తో కాజల్ ఆ రకంగా మెప్పిస్తుందేమో చూడాలి.

This post was last modified on June 19, 2023 3:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

1 hour ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

3 hours ago

మెస్సీ వచ్చే… మంత్రి పదవి పాయె

దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…

3 hours ago

ప్రభాస్ విజయ్ ఇద్దరూ ఒకే దారిలో

జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…

5 hours ago

డేంజర్ బెల్స్ మ్రోగించిన అఖండ 2

బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…

7 hours ago

అన్నగారికి కొత్త డేట్?

డిసెంబరు బాక్సాఫీస్‌కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…

7 hours ago