సరిగ్గా ఇంకో పది రోజుల్లో నిఖిల్ స్పై ప్యాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అయ్యింది. ఇంత హడావిడిగా విడుదల చేయడం ఇష్టం లేని నిఖిల్ ముందు ప్రమోషన్ల విషయంలో సుముఖత చూపించాడు. అయితే నిర్మాత పట్టుదల బలంగా ఉండటంతో అవుట్ ఫుట్ లో ఏదైనా తేడా వస్తే తనకూ ఇబ్బందేనని గుర్తించి ఫైనల్ గా ఓకే చెప్పాడు. మొన్నటిదాకా బాలన్స్ ఉన్న సన్నివేశాలను చిత్రీకరిస్తూనే ఉన్నారు. దగ్గుబాటి రానాతో చిన్న క్యామియో తాలూకు షూట్ కూడా ఫినిష్ చేశారు. ఇవాళో రేపో నిఖిల్ డబ్బింగ్ కూడా పూర్తవుతుంది. పబ్లిసిటీకి టైం లేకపోయినా ఉరుకులు పరుగులు పెట్టాల్సిందే
ఏది ఎలా ఉన్నా దీన్నో మంచి అవకాశంగానే చూడాలి. ఎందుకంటే 29న ఆదిపురుష్ కు రెండు వారాలు పూర్తవుతాయి. మొదటి మూడు రోజులు వసూళ్లతో బంతాట ఆడేసింది కానీ అసలు పరీక్ష సోమవారం నుంచి ఎదురు కానుంది. పబ్లిక్ టాక్, సోషల్ మీడియా ట్రెండ్స్ ని దృష్టిలో పెట్టుకుని చూస్తే ఇకపై మరీ ఎక్కువ అద్భుతాలు నమోదయ్యే సూచనలు తక్కువే. అలాంటప్పుడు బాక్సాఫీస్ దగ్గర వచ్చే గ్యాప్ నిఖిల్ స్పైకి వరంగా మారుతుంది. ఎలాగూ యాక్షన్ థ్రిల్లర్. నార్త్ ఆడియన్స్ కి సైతం ఇవి బాగా కనెక్ట్ అవుతాయి. పఠాన్ హిట్టయ్యింది ఇదే జానరనే విషయం మర్చిపోకూడదు
ఈ నేపథ్యంలో సరైన టాక్ వస్తే మాత్రం స్పైకి పండగే. కాకపోతే బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యేలా ప్రమోషన్ పెంచాలి. సుభాష్ చంద్ర బోస్ అంతర్ధానం గురించి బ్యాక్ డ్రాప్ కావడంతో అక్కడి జనాలకు మంచి ఆసక్తి ఉంటుంది. కార్తికేయ 2 ఇమేజ్ ఎలాగూ హెల్ప్ అవుతుంది. కాకపోతే ఇంటర్వ్యూలు ఈవెంట్లకు తగినంత సమయం చేతిలో ఉండదు. ఎడిటర్ గ్యారీని దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందించిన స్పైని అయిదు బాషల రిలీజ్ కు ప్లాన్ చేశారు. తగినన్ని థియేటర్లు దొరకబోతున్నాయి సత్యప్రేమ్ కి కథ, ఇండియానా జోన్స్ పోటీని తట్టుకోవాల్సి ఉంటుంది మరి
This post was last modified on June 19, 2023 11:20 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…