Movie News

కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ హ‌ఠాన్మ‌ర‌ణం

సోష‌ల్ మీడియాను ఫాలో అయ్యే తెలుగు వారిలో రాకేష్ మాస్ట‌ర్ అంటే తెలియ‌ని వాళ్లుండ‌రు. కొరియోగ్రాఫ‌ర్‌గా ఉన్న‌ప్ప‌టి కంటే.. ఆ ప‌ని మానేసి యూట్యూబ్ ఛానెళ్ల‌కు ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌డం మొద‌ల‌య్యాక ఎంతో పాపుల‌ర్ అయిన రాకేష్ మాస్ట‌ర్.. హ‌ఠాత్తుగా క‌న్నుమూయ‌డం ఆయ‌న ఫాలోవ‌ర్ల‌కు పెద్ద షాక్.

ఆయ‌న ఆదివారం సాయంత్రం గుండెపోటుతో క‌న్నుమూశాడు. సోష‌ల్ మీడియాలో పాపుల‌ర్ అయిన అగ్గిపెట్టి మ‌చ్చా, సునిశిత్ త‌దిత‌రుల‌తో కొన్ని రోజుల కింద‌టే రాకేష్ మాస్ట‌ర్ చేసిన సంద‌డి గురించి తెలిసిందే. స‌ద‌రు వీడియోలు, ఫొటోలు సోష‌ల్ మీడియాలో కొన్ని రోజుల పాటు హ‌ల్‌చ‌ల్ చేశాయి. వాటిలో చాలా హుషారుగా క‌నిపించిన రాకేష్ మాస్ట‌ర్.. ఇప్పుడు హ‌ఠాత్తుగా క‌న్నుమూయ‌డం బాధాక‌రం.

వారం రోజుల క్రితం వైజాగ్ ఔట్ డోర్ షూటింగ్ నుండి హైదరాబాద్‌కు వచ్చిన రాకేష్ మాస్టర్. అప్పటి నుంచి అనారోగ్యంతో ఉన్న‌ట్లు స‌మాచారం. సిటీలోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందిన‌ప్ప‌టికీ రాకేష్ మాస్ట‌ర్ అంత‌గా కోలుకోలేదు. ఆదివారం ఉదయం రాకేష్ మాస్ట‌ర్ త‌న‌ ఇంట్లోనే రక్తవిరోచనాలు చేసుకున్నట్లు స‌మాచారం. వెంట‌నే రామ్ న‌గ‌ర్లోని గాంధీ ఆసుపత్రికి ఆయ‌న్ని తరలించారు అత్య‌వ‌స‌ర విభాగంలో వైద్యులు రాకేష్ మాస్ట‌ర్ ప్రాణాలు కాపాడడం కోసం శత విధాలా ప్రయత్నం చేసిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేక‌పోయింది.

సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆయ‌న‌ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీక‌రించారు. రాకేష్ మాస్ట‌ర్ ఆసుప‌త్రిలో అచేత‌నంగా ఉన్న ఫొటోలు కూడా సోష‌ల్ మీడియాలోకి వ‌చ్చేశాయి. 90వ ద‌శ‌కంలో ప‌లు చిత్రాల‌కు రాకేష్ మాస్ట‌ర్ నృత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇప్పుడు టాప్ కొరియోగ్రాఫ‌ర్ అయిన శేఖ‌ర్ మాస్ట‌ర్ ఆయ‌న శిష్యుడే. కొన్నేళ్లుగా యూట్యూబ్ ఇంట‌ర్వ్యూల‌తో రాకేష్ మాస్ట‌ర్ సోష‌ల్ మీడియా సెల‌బ్రెటీ అయిపోయాడు.

This post was last modified on June 18, 2023 11:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామాయణం అర‌బిక్ ర‌చ‌యితను అభినందించిన మోడీ!

ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ కువైట్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. 43 ఏళ్ల త‌ర్వాత‌.. భార‌త ప్ర‌ధాని కువైట్‌లో ప‌ర్య‌టించ‌డం ఇదే తొలిసారి. శ‌నివారం…

2 hours ago

మాస్ సినిమా లకు పోటీ ఇవ్వనున్న క్లాస్ మూవీ?

ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…

10 hours ago

సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న.. ఎవరి తప్పు లేదు : అల్లు అర్జున్‌

పుష్ప‌-2 సినిమా ప్రీరిలీజ్ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట‌ అనంత‌రం చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై శ‌నివారం…

13 hours ago

కేజ్రీవాల్ మ‌రోసారి జైలుకేనా?

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌కు మ‌రో ఉచ్చు బిగుస్తోంది. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

14 hours ago

పెళ్లయినా.. కీర్తి తగ్గేదే లే!

కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…

14 hours ago