Movie News

ఓం రౌత్ పాత ట్వీట్‌పై దుమారం

సెల‌బ్రెటీలు అంత‌గా పాపుల‌ర్ కాని స‌మ‌యంలో చేసిన వ్యాఖ్యానాలు.. వాళ్ల సోష‌ల్ మీడియా పోస్టులు వివాదాస్ప‌దం కొత్తేమీ కాదు. ఇప్పుడు ఆదిపురుష్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ కూడా ఇలాంటి వివాదంలోనే చిక్కుకున్నాడు. అత‌ను 2015లో వేసిన ఒక ట్వీట్ ఇప్పుడు త‌న మెడ‌కు చుట్టుకుంటోంది. ఆ ట్వీట్‌లో హ‌నుమంతుడిని కించ‌ప‌రిచేలా వ్యాఖ్య‌లు చేశాడ‌న్న‌ది అత‌డి మీద ఉన్న ఆరోప‌ణ‌. ఇంత‌కీ ఆ ట్వీట్‌లో ఓం రౌత్ ఏమ‌న్నాడో చూద్దాం.

హ‌నుమంతుడు చెవిటి వాడా? మా భ‌వ‌నంలో జ‌నాలు అలాగే అనుకుంటున్న‌ట్లున్నారు. హనుమాన్ జ‌యంతికి విప‌రీత‌మైన శ‌బ్ధంతో పాట‌లు పెడుతున్నారు. అది కూడా సంబంధం లేని పాట‌లు.. అని ఓం రౌత్ పేర్కొన్నాడు. అది 2015 ఏప్రిల్ 4న చేసిన ట్వీట్. అప్ప‌టికే అత‌ను ద‌ర్శ‌కుడిగా ఒక సినిమా తీశాడు. లోక‌మాన్యః ఏక్ యుగ్ పురుష్ పేరుతో వ‌చ్చిన ఆ చిత్రం మ‌రాఠీలో తెర‌కెక్కింది. అప్ప‌టికి ఓం రౌత్ అంత పాపుల‌ర్ కాదు. కానీ 2020లో వ‌చ్చిన తానాజీ సినిమాతో ఓం పేరు మార్మోగింది. ఆ త‌ర్వాత అత‌ను ఆదిపురుష్ లాంటి మెగా మూవీని డైరెక్ట్ చేశాడు.

హ‌నుమంతుడు చెవిటివాడా అంటూ కించ‌ప‌రిచేలా వ్యాఖ్యానించిన రౌత్ ఇప్పుడు.. రామాయ‌ణం మీద సినిమా తీసి, హ‌నుమంతుడికి ఒక సీట్ అంటూ ప‌బ్లిసిటీ గిమ్మిక్కులు చేస్తున్నాడంటూ అత‌డి మీద నెటిజ‌న్లు విరుచుకుప‌డుతున్నారు. సినిమాలో హ‌నుమంతుడి డైలాగుల విష‌యంలోనూ వివాదం న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఐతే త‌న ట్వీట్‌లో ఓం త‌ప్పుగా ఏమీ మాట్లాడ‌లేద‌ని.. హ‌నుమంతుడిని కించ‌ప‌ర‌చ‌లేద‌ని కొంద‌రు త‌న‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. కానీ త‌ప్పేమీ లేకుంటే ఆ ట్వీట్‌ను ఓం ఎందుకు డెలీట్ చేశాడ‌ని త‌న వ్య‌తిరేకులు ప్ర‌శ్నిస్తున్నారు.

This post was last modified on June 18, 2023 1:25 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

7 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

7 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

8 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

8 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

9 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

9 hours ago