Movie News

స్పై రిలీజులో అధికారిక ట్విస్టు

నిఖిల్ హీరోగా ఎడిటర్ గ్యారీని దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందిన భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీ స్పై ఎన్నో ఊగిసలాటల మధ్య ఈ నెల 29 విడుదల కాబోతున్నట్టు యూనిట్ అధికారికంగా కొత్త పోస్టర్ తో ప్రకటించింది. నిజానికి నిన్నా మొన్నటి వరకు బాలన్స్ ఉన్న చిన్న వర్క్ కోసం నిఖిల్ షూటింగ్ లో పాల్గొన్నాడు. ఇంకా డబ్బింగ్ కూడా పూర్తి కాలేదని వార్తలు వచ్చాయి. పైగా ప్రమోషన్లకు అసలు టైం లేకపోవడంతో వాయిదా తప్పదని అందరూ కన్ఫర్మ్ గా నమ్ముతూ వచ్చారు. తీరా చూస్తే నిర్మాత రాజశేఖర్ ఇప్పుడీ ప్రకటనతో కొత్త షాక్ ఇచ్చారు.

చేతిలో ఉన్న పన్నెండు రోజుల్లో పబ్లిసిటీని ఎలా చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. టీజర్ వచ్చి చాలా వారాలు దాటేసింది. ఆదిపురుష్ మూడ్ నుంచి ప్రేక్షకులు త్వరగానే బయటికి వచ్చేలా ఉన్నారు కానీ స్పై గురించి వాళ్ళ మైండ్ లో రిజిస్టర్ కావడానికి ఈవెంట్లు, ఇంటర్వ్యూలు చాలా అవసరం. కానీ అతి కొద్దిసమయంలో ఇవన్నీ ఎంత వేగంగా పూర్తి చేయగలరనేది సస్పెన్స్ థ్రిల్లర్ గా మారనుంది. కొద్దిరోజుల క్రితం లిరికల్ సాంగ్ వచ్చినా నిఖిల్ తన సోషల్ మీడియాలో షేర్ చేసుకోలేదు. తీరా చూస్తే ఇప్పుడీ పరిణామం పట్ల ఎలా స్పందిస్తాడనేది ఆసక్తికరంగా మారింది

1945లో ప్లయిన్ క్రాష్ లో అంతర్ధానమైన సుభాష్ చంద్ర బోస్ మిస్టరీ మరణం చుట్టూ ఈ స్పై కథ రాసుకున్నారు. మంచి సస్పెన్స్ ఎలిమెంట్స్ చాలానే పొందుపరిచారు. విశాల్ చంద్రశేఖర్-శ్రీచరణ్ పాకాల జంటగా సంగీతం సమకూర్చారు.  అయితే హిందీలో అదే రోజు సత్యప్రేమ్ కి కథ మంచి అంచనాలతో వస్తోంది. హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ కొత్త వెర్షన్ కూడా భారీ ఎత్తున ప్లాన్ చేశారు. మరి ఇంత టైట్ షెడ్యూల్ లో స్పైని ఆఘమేఘాల మీద తీసుకొస్తున్నారు. మరి విడుదల లోపు ఏమైనా అనూహ్య ట్విస్టులు చోటు చేసుకుంటాయేమో వేచి చూడాలి. 

This post was last modified on June 17, 2023 11:43 pm

Share

Recent Posts

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

40 minutes ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

3 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

5 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

10 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

11 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

12 hours ago