Movie News

దిల్ రాజు తొందరపడనిది అందుకే

నైజాంకు సంబంధించి  సినిమాల డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాల్లో ముందు గుర్తొచ్చే పేరు దిల్ రాజు. ఇప్పుడంటే మైత్రి మేకర్స్ యాక్టివ్ అయ్యారు కానీ గతంలో ఏషియన్, సురేష్, గీతా లాంటి ఒకటి రెండు పెద్ద సంస్థల ఆధిపత్యమే కొనసాగేది. ఆదిపురుష్ కు సంబంధించిన బిజినెస్ డీల్స్ జరుగుతున్నప్పుడు దిల్ రాజు ఒకదశ వరకు ప్రయత్నించి వదిలేశారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అడిగిన అరవై కోట్లు వర్కౌట్ కాదనిపించి సైడ్ అయ్యారు. కట్ చేస్తే మైత్రి అంత మొత్తానికి ఒప్పేసుకుని పంపిణి బాధ్యతలు తీసుకుని హైదరాబాద్ తో సహా నైజామ్ మొత్తం భారీ సంఖ్యలో థియేటర్లు వచ్చేలా చేసుకున్నారు.

ఓపెనింగ్స్ పరంగా భారీ వసూళ్లు వచ్చాయి. వీకెండ్ వరకు ప్రభాస్ కు తిరుగు లేదు. కానీ అరవై కోట్ల బ్రేక్ ఈవెన్ జరగాలంటే ఆ ఒక్క ప్రాంతం నుంచే నూటా పది కోట్ల దాకా గ్రాస్ రావాలి. ఇది అంత సులభం కాదు. టాక్ పూర్తి పాజిటివ్ గా లేకపోవడం కొంత ప్రతికూలంగా ఉన్నా పెద్ద ఎత్తున జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ రక్షణ కవచంలా నిలబడ్డాయి. సండే వరకు వీటికి ఢోకా లేదు. ఆపై నుంచి కనీసం యాభై శాతం ఆక్యుపెన్సీ ఉంటే తప్ప ఆదిపురుష్ బ్రేక్ ఈవెన్ దిశగా వెళ్లదు. దిల్ రాజు ఇంతగా వెనుకడుగు వేయడానికి శాకుంతలం దెబ్బ ఓ కారణమని సన్నిహితుల మాట

గతంలో లైగర్, ఆచార్య తాలూకు వ్యవహారాలు జరిగినప్పుడూ వాటిని వరంగల్ శీనుకి వదిలేసి తప్పుకున్న దిల్ రాజు ఆ నిర్ణయాల వల్ల చాలా సేఫ్ అయ్యారు. ప్రతి సినిమా తనకే కావాలన్న పంతం లేకపోవడం వల్లే ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఒకవేళ ఆదిపురుష్ కనక యునానిమాస్ బ్లాక్ బస్టర్ అనిపించుకుని ఉంటే దిల్ రాజుకి మిస్ చేసుకున్న ఫీలింగ్ ఉండేది. కానీ ఇప్పుడది ఏ కోశానా ఉండదు. ఎలాగూ సలార్ తనకే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఆదిపురుష్ చేజారడం పట్ల ఎలాంటి భావం బయటికి కనిపించనివ్వడం లేదని దిల్ కాంపౌండ్ టాక్ 

This post was last modified on October 8, 2023 4:39 pm

Share

Recent Posts

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

2 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

2 hours ago

వీసా చేతిలో ఉన్నా రద్దే… అమెరికా కొత్త చెకింగ్ ఇదే!

అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…

2 hours ago

బొద్దింక‌ల నిర‌స‌న‌… ఈసారి ఇంకా గట్టిగా!!

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ).. తాజాగా మ‌రో ఉద్య‌మానికి తెర‌దీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…

2 hours ago

ఆ పరిస్థితిలో హనుమాన్ చాలీసాను పఠించిన కెప్టెన్

హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్ర‌మించేవారు కొంద‌రైతే.. తాము చేసిన ప‌నుల కార‌ణంగా చూపిన ధైర్య సాహ‌సాల కార‌ణంగా రాత్రికి…

4 hours ago

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

5 hours ago