బాక్సాఫీస్ అంటే ఏదో టికెట్ రేట్లు, అమ్మకాలు, లాభాలు అనే ఆలోచిస్తాం కానీ అసలు మనకు కనిపించని ఎన్నో కోణాలు ఇందులో ఉంటాయి. నిన్న విడుదలైన ఆదిపురుష్ విషయంలో ఎలాంటి టాక్ వచ్చిందో, పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉందో చూస్తున్నాం. మూడు రోజులకు సరిపడా అడ్వాన్స్ బుకింగ్స్ ముందస్తుగా బాగా జరగడం వల్ల బయ్యర్లకు గండం తప్పింది కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ గమనిస్తే సోమవారం నుంచి పెద్ద సవాలే ఎదురు కానుంది. ఇక విషయానికి వస్తే ఆదిపురుష్ ఫలితం తాలూకు ప్రభావం పివిఆర్ షేర్ ధరని తగ్గించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
నిన్న బాంబే స్టాక్ ఎక్స్చేంజిలో పివిఆర్ ఐనాక్స్ షేర్ ధర అంతకు ముందు ఉన్న దానికన్నా 3.40 శాతం తగ్గిపోయి 1448 రూపాయల దగ్గర క్లోజ్ అయ్యింది. ఆదిపురుష్ విడుదల ముందు పెరుగుదల కనిపిస్తే రివ్యూలు బయటికి వచ్చాక అనూహ్యంగా నెంబర్ తగ్గిపోయింది. ప్రముఖ ట్రేడ్ రీసెర్చ్ అనలిస్టులు ఈ కోణాన్నే హైలైట్ చేస్తున్నారు. ఇప్పటిదాకా అన్ని భాషల వెర్షన్లకు కలిపి పివిఆర్ సంస్థ సుమారు 6 లక్షలకు పైగా టికెట్లను అమ్మేసింది. వీకెండ్ లో దొరకవనే ఉద్దేశంతో ఆడియన్స్ భారీ ఎత్తున ముందస్తుగా కొనేశారు. దీంతో ఆదివారం దాకా హౌస్ ఫుల్స్ పడుతున్నాయి
సోమవారం నుంచి పరిస్థితి ఎలా ఉండబోతోందో చూడాలి. గత ఆర్థిక ఫలితాల్లో మూడు వందల కోట్ల దాకా నికర నష్టం చవిచూసిన పివిఆర్ ఐనాక్స్ ఆదిపురుష్ తర్వాత షేర్ వేల్యూ 1879 రూపాయల దాకా వెళ్లొచ్చని అంచనా వేసింది. అదే కనక జరిగితే క్రమంగా లాభాల వైపు మళ్లొచ్చని లెక్కలు కట్టిందట. కానీ జరుగుతున్నది వేరే. వేసవి మొత్తం బాలీవుడ్ కు డ్రై సీజన్ గా మారిపోవడం మల్టీప్లెక్సుల వ్యాపారాన్ని దెబ్బ కొట్టాయి. ఈ ఏడాది మొత్తంలో పఠాన్ ఒక్కటే ఇండస్ట్రీ హిట్ గా నిలవగా మిగిలినవి అందులో సగం స్థాయి కూడా దాటలేదు. ఆదిపురుష్ ఏమైనా మార్పు తెస్తుందేమో చూడాలి
This post was last modified on June 17, 2023 1:09 pm
‘పుష్ప-2’ బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మహిళ మృతి కేసుకు సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్…
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పాలిటిక్స్ లో అంతగా క్లిక్ కాకపోయినా కూడా ఓ వర్గం జనాల్లో ఆయనపై మంచి…
హైదరాబాద్ మాదాపూర్లోని నాలెడ్జ్ సిటీలో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సత్వ ఎలిక్విర్ భవనంలోని ఐదో అంతస్తులో ఒక్కసారిగా…
ఒకప్పుడు కామెడీ సినిమాలంటే కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన అల్లరి నరేష్ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ చూశాడు.…
వెంకటేష్ ప్రేమంటే ఇదేరాతో ఇండస్ట్రీకి పరిచయమై మొదటి ఆల్బమ్ తోనే సూపర్ హిట్ కొట్టిన సంగీత దర్శకుడు రమణ గోగులకు…
ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు విద్యార్థులకు నైతిక విలువల సలహాదారుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు,…