కన్నడ సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి చాటిన సినిమా ‘కేజీఎఫ్’. అంతకుముందు వరకు కన్నడ సినిమా కర్ణాటక బౌండరీలు దాటేదే కాదు. వేరే చోట్ల నామమాత్రంగా ఆడేవి కన్నడ సినిమాలు. కానీ కేజీఎఫ్ తెలుగు, తమిళం, హిందీ, మలయాళం.. ఇలా వివిధ భాషల్లో విడుదలై సంచలన విజయం సాధించింది.
మన దగ్గర ‘బాహుబలి’ సెన్సేషన్ క్రియేట్ చేశాక వేరే స్టార్ హీరోలు ఆ తరహా పాన్ ఇండియా, భారీ చిత్రాల కోసం ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే కన్నడ హీరోలు సైతం తమకూ ఓ ‘కేజీఎఫ్’ పడితే బాగుండని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే అతడే శ్రీమన్నారయణ, పయిల్వాన్ లాంటి భారీ చిత్రాలు వచ్చాయి. కానీ అవి ఆశించిన ఫలితాన్నందుకోలేదు.
ఐతే ‘పయిల్వాన్’లో నటించిన సుదీప్.. ఇప్పుడు మరో భారీ సినిమాతో రెడీ అవుతున్నాడు. అదే ‘ది వరల్డ్ ఆఫ్ ఫాంటమ్’. కేజీఎఫ్ తరహా భారీ చిత్రమే ఇది. దీన్ని ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ మధ్య ఈ చిత్ర షూటింగ్ పున:ప్రారంభం అయిన సందర్భంగా సుదీప్ సినిమాలోని ఓ దృశ్యంతో మోషన్ పోస్టర్ రిలీజ్ చేశాడు. అది ఎగ్జైటింగ్‌గా అనిపించింది.
తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. ఇందులో సుదీప్ విక్రాంత్ రోనా అనే పాత్రలో నటిస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే ఇది చారిత్రక నేపథ్యంలో సాగే సినిమాలా కనిపిస్తోంది. ‘పైరేట్స్ ఆఫ్ ద కరీబియన్’ ఛాయలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని స్వయంగా సుదీపే నిర్మిస్తున్నాడు. మరి ఈ సినిమాతో సుదీప్ ఆశ నెరవేరి అతను కూడా పాన్ ఇండియా హిట్ అందుకుంటాడేమో చూడాలి.
This post was last modified on August 11, 2020 11:53 am
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…