ప్రస్తుతం టాలీవుడ్ బిగ్ షాట్స్‌లో సునీల్ నారంగ్ ఒకరు. తెలంగాణలో మేజర్ థియేటర్లు ఆయన చేతిలోనే ఉన్నాయి. ఏషియన్ మూవీస్ సొంతంగా నిర్మించిన థియేటర్లకు తోడు.. అనేక సింగిల్ స్క్రీన్లు, జంట థయిేటర్లను రెనొవేట్ చేసి వాటి రూపు రేఖలే మార్చేసింది. అలాగే సొంతంగా సెలబ్రెటీల భాగస్వామ్యంలో మల్టీప్లెక్స్ సముదాయాలను కూడా నిర్మిస్తూ వాటికి మంచి క్రేజ్ తీసుకొస్తోంది ఏషియన్ సంస్థ.
హైదరాబాద్‌లో మహేష్ బాబుతో కలిసి ఏషియన్ వాళ్లు నిర్మించిన ‘ఏఎంబీ’ను బ్లాక్‌బస్టర్ మల్టీప్లెక్స్‌గా చెప్పొచ్చు. మొదలైన నాటి నుంచి మంచి క్రేజ్, డిమాండ్‌తో నడుస్తోంది ఏఎంబీ. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి మహబూబ్‌నగర్‌లో ‘ఏవీడీ సినిమాస్’ పేరుతో మల్టీప్లెక్స్ నిర్మించగా.. అక్కడా మంచి రెస్పాన్సే వస్తోంది. తాజాగా అల్లు అర్జున్‌తో కలిసి అమీర్ పేట సత్యం థియేటర్ స్థానంలో నిర్మించిన ‘ఏఏఏ’ మల్టీప్లెక్స్ ఈ శుక్రవారమే అందుబాటులోకి రానుంది.
ఏషియన్ వాళ్లు ఈ సెలబ్రెటీ అసోసియేటెడ్ మల్టీప్లెక్స్ నిర్మాణాలను ఇక ముందూ కొనసాగించనున్నారు. తొలిసారి వాళ్లు తెలంగాణను దాటుతున్నారు. అలా అని వాళ్లు వెళ్తోంది ఆంధ్రప్రదేశ్‌కు కాదు.. తమిళనాడుకు. చెన్నైలో ఒక భారీ మల్టీప్లెక్స్‌ను ఏషియన్ వాళ్లు నిర్మించబోతున్నారు.
అక్కడ వాళ్లు అసోసియేట్ కాబోతోంది యువ కథానాయకుడు శివ కార్తికేయన్‌తో. తమిళంలో చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి స్టార్ హీరోగా ఎదిగిన శివకు యూత్‌లో, ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉంది. శివతో ఏషియన్ వాళ్లు ‘ప్రిన్స్’ సినిమా చేసినపుడు తనతో మంచి అనుబంధం ఏర్పడింది. ఈ బంధాన్ని ఇప్పుడు వ్యాపారంలోకి తీసుకెళ్తున్నారు. శివ భాగస్వామ్యంతో చెన్నైలో మల్టీప్లెక్స్ నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. చూస్తుంటే ఏషియన్ థియేటర్ బిజినెస్ దేశమంతా విస్తరించేలా కనిపిస్తోంది.
This post was last modified on June 16, 2023 10:44 am
అట్లీ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా అనౌన్స్ మెంట్ వచ్చాక దాని మీద సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ…
మంగళగిరి నియోజకవర్గం పేరు చెప్పగానే ఠక్కున ఇప్పుడు నారా లోకేష్ గుర్తుకు వస్తున్నారు. నియోజక వర్గంలో చేపడుతున్న పనులు కావొచ్చు..…
మాములుగా కొత్త సినిమాల విడుదల రోజు తెల్లవారుఝాము లేదా అర్ధరాత్రి షోలు వేయడం సహజం. కానీ నాలుగో రోజు మిడ్…
గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న అల్లు అర్జున్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఎట్టకేలకు అఫీషియల్…
చరిత్ర సృష్టిస్తూ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా బాహుబలి 2 రికార్డుకే ఎసరు…
తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…