ఆస్కార్ దాకా తెలుగు సినిమాను తీసుకెళ్లిన జక్కన్న మీద ఇలాంటి కామెంట్ చేస్తే మూవీ లవర్స్ కి నచ్చదేమో కానీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే మాత్రం ప్రభాస్ మేనియాకున్న బలమెంతో ఆదిపురుష్ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే అర్ధమైపోతుంది. ఆర్ఆర్ఆర్ విడుదలకు ముందు విపరీతమైన ప్రమోషన్లు జరిగాయి. దేశం మొత్తం తిరిగి పబ్లిసిటీ చేశారు. కాళ్లకు చక్రాలు కట్టుకుని జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అడిగిన మీడియా అందరికీ వీడియో ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్ లు నెలల తరబడి చేశారు.
దానికి తగ్గ గొప్ప ఫలితం రావడం సంతోష పడాల్సిన విషయమే. అయితే ఆదిపురుష్ కు అవేవీ జరగలేదు. తిరుపతిలో గ్రాండ్ గా జరిపిన ప్రీ రిలీజ్ వేడుక తప్ప మరో ఈవెంట్ లేదు. ప్రభాస్ యుఎస్ వెళ్ళిపోయాడు. రిలీజయ్యాకే ఇండియా తిరిగి వస్తాడు. దర్శకుడు ఓం రౌత్, టి సిరీస్ అధినేతలు చివరి నిమిషం బిజినెస్ వ్యవహారాలు, థియేటర్ల కేటాయింపులో తలమునకలై ఉన్నారు. కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ బయట కనిపించడం లేదు. అయినా సరే ఆదిపురుష్ బుకింగ్స్ ఫైర్ మీదున్నాయి. తెలంగాణ, ఏపీలో యాభై రూపాయల పెంపుతో అనుమతులు రావడం ఆలస్యం సోల్డ్ అవుట్ అవుతున్నాయి
రాముడి సెంటిమెంట్ ఇక్కడ కీలక పాత్ర పోషించినా అది ప్రభాస్ చేయడం వల్లే ఇంత రేంజ్ అనేది ఒప్పుకోవాల్సిన వాస్తవం. నార్త్ లో షోలు ఎన్ని వేస్తున్నా చాలడం లేదు. కార్పొరేట్ సంస్థలు, సెలబ్రిటీలు వేల టికెట్లు వితరణ చేస్తున్నా మొత్తం కలెక్షన్లో వాటి పాత్ర నామమాత్రం కాబట్టి అదేం పెద్ద లెక్క కాదు. కానీ హైక్ ఉన్నా కూడా జనం ఈ స్థాయిలో బుక్ చేసుకుంటున్నారంటే ఆదిపురుష్ జ్వరం ఏ స్థాయిలో పట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. కేవలం రెండు ట్రైలర్లు, ఒక ఆడియో ఆల్బమ్ తో సాధించిన ఘనత ఇది. అందుకే రాజమౌళి మార్కెటింగ్ చేయకపోయినా దాన్ని దాటేలా రికార్డులు వచ్చేలా ఉన్నాయి
This post was last modified on June 14, 2023 11:23 pm
అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…
అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…