సినిమా తీసేది దర్శకుడు. కాబట్టి ఫలానా దర్శకుడి సినిమాలో క్వాలిటీ ఉంటుంది.. ఆ దర్శకుడి చిత్రమైతే భిన్నంగా ఉంటుంది అని నమ్మి జనాలు సినిమాలకు వెళ్తుంటారు. కానీ ఒక హీరో సినిమాలో బలమైన కంటెంట్ ఉంటుంది, ఏదో ఒక కొత్తదనం ఉంటుందని కోట్ల మంది నమ్మి సినిమాలకు వెళ్లే నమ్మకం కలిగించి హీరో ఆమిర్ ఖాన్. లగాన్, రంగ్ దె బసంతి, త్రీ ఇడియట్స్, పీకే, దంగల్.. ఈ సినిమాల వరుస చూస్తే చెప్పేయొచ్చు ఆమిర్ సినిమాల క్వాలిటీ ఏంటో. ఎప్పుడో కానీ అతడి సినిమాలు తేడా కొట్టవు. థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ ఆ కోవలోని చిత్రమే. ఇది విడుదలై రెండేళ్లు కావస్తోంది. ఈ సినిమా రిలీజయ్యాక ఏడాది విరామం తీసుకుని హలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ రీమేక్‌ను పట్టాలెక్కించాడు ఆమిర్.
లాల్ సింగ్ చద్దా పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2019 క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా వచ్చి ఆమిర్ ప్రణాళికల్ని దెబ్బ తీసింది. ఐదు నెలలుగా షూటింగ్ జరగట్లేదు. వచ్చే కొన్ని నెలల్లోనూ చిత్రీకరణ సాధ్యపడేలా లేదు. దీంతో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవికో.. లేదంటే ఇండిపెండెన్స్ డే సీజన్‌కో వాయిదా వేస్తారని అనుకున్నారు. కానీ ఆమిర్ మాత్రం తనకెంతో ఇష్టమైన క్రిస్మస్ సీజన్‌లోనే సినిమాను తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. క్వాలిటీ విషయంలో అసలు రాజీ పడని ఆమిర్.. ఆ ఉద్దేశంతోనే కాస్త ఎక్కువ సమయం తీసుకునేలా ఉన్నాడు. ఆమిర్ మిత్రుడైన అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కరీనా కపూర్ కథానాయికగా నటిస్తోంది.
This post was last modified on August 11, 2020 2:09 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…