అదేంటి ఓటిటి సంస్థ హోటల్ బిజినెస్ పెట్టడం ఏమిటనుకుంటున్నారా. ఇది అక్షరాలా నిజం. నెట్ ఫ్లిక్స్ జూన్ 30న తన బ్రాండ్ పక్కనే బైట్స్ అని పేరు పెట్టి లాస్ ఏంజిల్స్ లో మొదటి రెస్టారెంట్ ప్రారంభించబోతోంది. ప్రస్తుతం వరల్డ్ నెంబర్ వన్ డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్ గా పేరు తెచ్చుకున్న ఈ కంపెనీ వ్యాపారాన్ని విస్తరించుకునే క్రమంలో కొత్త ఆలోచనలు చేస్తోంది. 2007లో డివిడిలు అద్దెకు ఇచ్చి హోమ్ డెలివరీ సౌకర్యంతో కార్యకలాపాలు ప్రారంభించిన నెట్ ఫ్లిక్స్ అతి తక్కువ కాలంలోనే ప్రత్యర్థులు ఎవరూ సులభంగా చేరుకోలేనంత స్థాయికి చేరుకుంది.
నెట్ ఫ్లిక్స్ బైట్స్ లో చాలా సౌకర్యాలు ఆఫర్లు ఉండబోతున్నాయి. వినియోగదారులకు సబ్స్క్రిప్షన్ లో ప్రత్యేక డిస్కౌంట్లు ఇవ్వబోతున్నారు. ఆల్రెడీ అకౌంట్ వాళ్లకు బిల్లులో రాయితీ ఇస్తారు. బెస్ట్ షోస్ ని అక్కడే హోటల్ స్క్రీన్ మీద రెగ్యులర్ గా ప్రదర్శిస్తారు. ప్రీమియర్ లాంజ్ లో హోమ్ థియేటర్ లాంటి సెటప్ ఉంటుంది. ఈ రెస్టారెంట్ లో ప్రముఖ చెఫ్ లు పనిచేయబోతున్నారు. కర్టిస్ స్టోన్, డామినిక్ క్రెన్, రాడ్నీ స్కాట్, మింగ్ సాయ్, యాంగ్ కిమ్, జాక్వెస్ టోరెస్, ఆండ్రూ జిమ్మర్న్ ఈ లిస్టులో ఉన్నారు. ఇండియా నుంచి నదియా హుస్సేన్ ఈ బృందంలో భాగం కాబోతున్నారు.
నెట్ ఫ్లిక్స్ లో వచ్చే కలినరీ షోస్ లో స్ట్రీమ్ అయ్యే ప్రత్యేక వంటకాలు ఇక్కడ లైవ్ లో చూపిస్తారు. ప్రతి టేబుల్ కి ఒక స్క్రీన్ ని అమర్చి తింటూ షోలు ఎంజాయ్ చేయొచ్చు. త్వరలో వీటిని అన్ని దేశాల్లో విస్తరింపజేయబోతున్నారు. ఈ లెక్కన భవిష్యత్తులో అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్, హెచ్బిఓ హోటళ్లు కూడా చూడొచ్చన్న మాట. ఇక ముఖేష్ అంబానీ కనక జియో పేరుతో రెస్టారెంట్లు మొదలుపెడితే పోటీ రసవత్తరంగా ఉంటుంది. నెట్ ఫ్లిక్స్ అధినేతలు మాత్రం కేవలం బిజినెస్ కోసమే బైట్స్ పెట్టలేదని, ఎక్కువ కస్టమర్లకు తమ బ్రాండ్ చేరువ కావడం కోసమని అంటున్నారు. పుణ్యం పురుషార్థం రెండూ దక్కించుకోవడం ఇదే
This post was last modified on %s = human-readable time difference 5:32 pm
ది హైప్ ఈజ్ రియల్ అనేది సాధారణంగా ఒక పెద్ద సినిమాకున్న అంచనాలను వర్ణించేందుకు అభిమానులు వాడుకునే స్టేట్ మెంట్.…
దేశంలో రిజర్వేషన్ల పరిమితి 50 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. ఏ రిజర్వేషన్ అయినా.. 50 శాతానికి మించి ఇవ్వడానికి…
తండేల్ విడుదల తేదీ ప్రకటన కోసం నిర్వహించిన ప్రెస్ మీట్లో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు టీమ్ పంచుకుంది.…
ఈ దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడిపోయింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు పడ్డాయి. వాటికి మంచి వసూళ్లు కూడా వచ్చాయి.…
మరో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవి పూర్తిగా బడ్జెట్ సమావేశాలేనని కూటమి సర్కారు చెబుతోంది. వచ్చే మార్చి…
దసరా బ్లాక్ బస్టర్ తో నానికి మొదటి వంద కోట్ల గ్రాసర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రెండోసారి న్యాచురల్…