టాలీవుడ్ టాప్ హీరోయిన్ స్థానం ఎవరిదంటే మీడియా కొంచెం ఆలోచించాలేమో కానీ సగటు ప్రేక్షకులు మాత్రం ఠక్కున శ్రీలీల పేరు చెప్పేంత రేంజ్ కి అమ్మడు చేరుకుంది. ఇప్పటిదాకా చేసింది రెండు సినిమాలు. మొదటిది పెళ్లి సందD ఫ్లాప్. అయినా బాగానే డబ్బులొచ్చాయి. అది కీరవాణి పాటలు, ఈ అమ్మాయి గ్లామర్ వల్లేనన్నది వాస్తవం. ధమాకా ఏకంగా వంద కోట్లు రాబట్టింది. అందులో రవితేజ ఎనర్జీకి ధీటుగా కొన్ని పాటల్లో ఏకంగా మాస్ మహారాజానే డామినేట్ చేసిందా అనిపించే రేంజ్ లో శ్రీలీల చేసిన హల్చల్ మాస్ ఆడియన్స్ ని బాగా దగ్గర చేసింది
ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా తనతో చేస్తున్న ప్రొడక్షన్ హౌసులు కొత్త పోస్టర్లతో హోరెత్తిస్తున్నాయి. గుంటూరు కారం టీమ్ ఒక స్పెషల్ లుక్ వదిలింది. అఆలో అనుపమ పరమేశ్వరన్ తరహాలో త్రివిక్రమ్ తననేదో మరదలి టైపు పాత్రలో చూపించబోతున్నారని అర్థమయ్యింది. రామ్ – బోయపాటి శీను కాంబో మూవీ, బాలకృష్ణ – అనిల్ రావిపూడిల భగవంత్ కేసరి, నితిన్ – వక్కంతం వంశీ కాంబో మూవీ, వైష్ణవ్ తేజ్ ఆదికేశవ, బన్నీతో ఆహా చేస్తున్నసస్పెన్స్ ప్రాజెక్ట్ ఇలా ఆయా నిర్మాణ సంస్థలన్నీ కొత్త కొత్త లుక్స్ ని ఫ్యాన్స్ కి కానుకగా ఇచ్చాయి. ఒక అప్ కమింగ్ హీరోయిన్ కి ఈ రేంజ్ హంగామా ఎప్పుడు జరగలేదు
మొన్నటిదాకా పూజా హెగ్డే, రష్మిక మందన్న జపం చేసిన దర్శక నిర్మాతలు ఇప్పుడు పూర్తిగా శ్రీలీల తప్ప వేరే పేరు స్మరించడం లేదు. ఎనిమిదికి పైగా సినిమాల్లో లాక్ అయిన ఈ అమ్మాయికి ఇంకా ఆఫర్ల వర్షం కురుస్తూనే ఉంది. ఉప్పెన టైంలో కృతి శెట్టికి వచ్చిన ఫేమ్ తర్వాత వరస ఫెయిల్యూర్స్ తో తగ్గిపోయినా శ్రీలీలకు ఆ సమస్య రాలేదు. పైగా స్టార్ హీరోల సరసన అవకాశాలు రావడం ఒకేసారి పది మెట్లు ఎక్కేలా చేసింది. ధమాకాలో సీనియర్ హీరో పక్కన చేయడం ఏమిటనే కామెంట్స్ నుంచి ఇన్ని అవకాశాలు ముంచెత్తడం దాకా తన సుడి మాములుగా లేదు
This post was last modified on June 14, 2023 3:13 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…