స్టార్ హీరోల సినిమాలు ఆగిపోతే అభిమానులు పడే బాధ వర్ణనాతీతం. అందులోనూ అవి క్రేజీ కాంబినేషన్లైతే చెప్పేదేముంది. కమల్ హాసన్ కి అలాంటివి రెండున్నాయి. మొదటిది మరుద నాయగం. 1997లో మొదలుపెట్టి మూడేళ్ల నిర్మాణం అయ్యాక రకరకాల కారణాలతో ఆపేశారు. ఎలిజిబెత్ మహారాణి దీని ఓపెనింగ్ కి రావడం సంచలనం. అప్పట్లోనే నలభై కోట్ల బడ్జెట్ ని కేటాయించుకుని అవసరమైతే అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టేందుకు పలు హాలీవుడ్ కంపెనీలతో టైఅప్ కూడా చేసుకున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించలేదు. ఎంత ట్రై చేసినా లాభం లేకపోయింది.
అందులో నటించిన అమ్రిష్ పూరి, విష్ణువర్ధన్ లాంటి వాళ్ళు కాలం కూడా చేశారు. సత్యరాజ్, నాజర్, గౌతమి, మాధురి దీక్షిత్ లు ఇప్పటికీ ఇందులో భాగం కావడం కోసం ఎదురు చూస్తున్నారు. ఇళయరాజా కంపోజింగ్ లో పాటలు రికార్డు చేశారు. ఒకటి రెండు యూట్యూబ్ లో అందుబాటులో ఉన్నాయి. ఒక చారిత్రాత్మక కథను ప్రేక్షకులకు స్వీయ దర్శకత్వంలో చెప్పాలన్న కమల్ తపన ఇప్పటిదాకా తీరలేదు. అభిమానులు మాత్రం డిమాండ్ చేస్తున్నారు కానీ ఫలితం దక్కలేదు. ఇప్పుడంటే ప్యాన్ ఇండియాలంటూ ఊగిపోతున్నాం కానీ మరుదనాయగం దానికి పునాది.
దీంతో పాటు కమల్ మొదలుపెట్టి ఆపేసిన శభాష్ నాయుడు కూడా వెయిటింగ్ లిస్టులో ఉంది. శృతి హాసన్ ని క్యాస్టింగ్ లో భాగం చేసి కొంత భాగం షూటింగ్ కూడా చేశారు. దశావతారంలో సిబిఐ ఆఫీసర్ నాయుడు పాత్రనే ఫుల్ లెన్త్ రోల్ గా మార్చి స్క్రిప్ట్ రాసుకున్నారు. ఇదీ అనారోగ్యం వల్ల ఆపేశారు. విక్రమ్ ఇచ్చిన బ్లాక్ బస్టర్ ఊపుతో కొత్త ఉత్సాహం తెచ్చుకున్న కమల్ ప్రస్తుతం ఇండియన్ 2, మణిరత్నం సినిమా, తెగింపు దర్శకుడు వినోత్ తో ప్రాజెక్ట్ కమిటయ్యారు. కనీసం ఇవయ్యాక అయినా మరుదనాయగం, శభాష్ నాయుడు బయటికి రావాలని సగటు మూవీ లవర్స్ కోరిక
This post was last modified on June 14, 2023 12:04 am
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…