రిచర్డ్ గెరె.. ఈ హాలీవుడ్ హీరో గుర్తున్నాడా? ఆయన సినిమాల కంటే కూడా ఓ వివాదం ద్వారా భారతీయ జనాలకు బాగా పరిచయం ఈ సీనియర్ నటుడు. అప్పట్లో ఓ సామాజిక కార్యక్రమం కోసమని ఇండియాకు వచ్చిన గెరె.. ఓ వేదిక మీద శిల్పా శెట్టితో చేసిన రొమాన్స్ చర్చనీయాంశమైంది.
శిల్పాను ముద్దుల్లో ముంచెత్తుతూ ఆమె మీద వాలిపోవడం దుమారం రేపింది. ఆయన ఇండియాకు వచ్చింది ఓ మంచి పని మీదే అయినా.. ఇలా వేదిక మీద హద్దులు దాటి ప్రవర్తించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. దీనిపై శిల్పా మీడియాకు, అభిమానులకు సర్దిచెప్పాల్సి వచ్చింది. ఇప్పుడీ పెద్ద మనిషి మరోసారి వార్తల్లోకి వచ్చాడు. గెరె 70 ఏళ్ల వయసులో మరోసారి తండ్రి కావడం విశేషం. ఇటీవలే గెరెకు కొడుకు పుట్టాడు.
గెరెకిది మూడో సంతానం. అతడి మొదటి భార్యతో పుట్టిన 20 ఏళ్ల కొడుకు ఉండగా.. ఆమెకు విడాకులు ఇచ్చి కొన్నేళ్ల కిందటే సోషల్ యాక్టివిస్ట్ అలెజాండ్రా సిల్వాను పెళ్లాడాడు. వీరికి గత ఏడాది ఓ కొడుకు పుట్టాడు. మళ్లీ ఏడాది తిరిగేసరికి ఇంకో బిడ్డను ప్రసవించింది అలెజాండ్రా.
మన దగ్గర 70 ఏళ్ల వయసులో తండ్రి అయితే వింత లాగా చెప్పుకుని మీడియాలో వార్తలు, స్టోరీలు రాసేస్తుంటారు కానీ.. యుఎస్‌లో 60-70 ఏళ్ల వయసున్న వాళ్లు తమ వయసులో సగం ఉన్న వాళ్లను పెళ్లాడటం.. పిల్లల్ని కనడం వింతేమీ కాదు. హాలీవుడ్లో ఇలాంటి జంటలు చాలానే ఉన్నాయి. గెరె కూడా ఈ జాబితాలో చేరాడు.
గెరె ఇంతకుముందు ఇండియాకు వచ్చి స్టేజ్ మీద శిల్పాతో ఆ రేంజిలో రొమాన్స్ చేసేటప్పటికే ఆయన వయసు 60వ పడికి చేరువ అవుతూ ఉంది. ఇప్పుడు 70 ఏళ్ల వయసులో ఏడాది వ్యవధిలో ఇద్దరు పిల్లల్ని కనడాన్ని బట్టి అప్పుడు శిల్పాతో ఆయనలా ప్రవర్తించడంలో ఆశ్చర్యమేమీ లేదని అర్థం చేసుకోవచ్చు.
This post was last modified on April 24, 2020 2:07 pm
ఐకాన్ స్టార్ అభిమానులే కాదు సగటు ప్రేక్షకులు కూడా విపరీతమైన ఆసక్తితో ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్…
బిజీ హీరోయిన్ల డేట్లను షెడ్యూల్స్ తగట్టు తెచ్చుకోవడం దర్శక నిర్మాతలకు ఒక్కోసారి పెద్ద సవాల్ గా మారుతుంది. అంత డిమాండ్…
2007 లో విడుదలైన హ్యాపీ డేస్ మూవీతో కుర్ర కారులో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ తమన్న. అగ్ర…
దేశవ్యాప్తంగా హిందీ భాషను రుద్దాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తమిళనాట…
ఇళయరాజా పేరు ఈ మధ్య కాలంలో తరచుగా వివాదాలతోనే వార్తల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. వయసు మీద పడడంతో ఆయన…
ఆస్కార్ అవార్డుల్లో ఆధిపత్యం చలాయించే అన్ని సినిమాలకూ వసూళ్లు వస్తాయని గ్యారెంటీ లేదు. అలాగే వసూళ్ల మోత మోగించిన చిత్రాలకూ…