Movie News

పవన్.. 70 ఏళ్లు వెనక్కి!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులను ప్రస్తుతం అమితంగా ఆకర్షిస్తున్న సినిమా ‘ఓజీ’. పవన్ వీరాభిమానుల్లో ఒకడైన సుజీత్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ దగ్గర్నుంచే ఒక ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించింది. స్టైలిష్ డైరెక్టర్‌గా పేరున్న సుజీత్.. తన అభిమాన కథానాయకుడిని సూపర్ స్టైలిష్‌గా ప్రెజెంట్ చేస్తాడని.. సినిమాలో ఎలివేషన్లు ఒక రేంజిలో ఉంటాయని అభిమానులు అంచనాలు వేస్తున్నారు.

పవన్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టుల్లో చివరగా మొదలైనప్పటికీ.. ప్రస్తుతం ఆయన ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి చకచకా పూర్తి చేస్తున్న చిత్రం ఇదే. ఈ సినిమాలో పవన్ మార్షల్ ఆర్ట్స్ నిపుణుడిగా.. గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నట్లు ఇప్పటికే బయటికి వచ్చిన ప్రోమోలు, ఫొటోలను బట్టి అర్థమైంది. కాగా ‘ఓజీ’ గురించి ఇప్పుడు ఒక ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.

ఇది పీరియడ్ ఫిలిం అని చిత్ర వర్గాల సమాచారం. ఐతే పీరియడ్ అంటే 20, 30 ఏళ్ల ముందు నడిచే కథ అనుకుంటే పొరపాటే. ఏకంగా 70 ఏళ్లు వెనక్కి వెళ్లి.. అప్పటి నేపథ్యంతో కథను నడిపించబోతున్నారట. 1950 ప్రాంతంలో నడిచే కథగా దీన్ని తీర్చిదిద్దుతున్నాడట సుజీత్. అప్పటి పరిస్థితులను రీక్రియేట్ చేయడం.. పవన్‌ ఇమేజ్‌కు తగ్గట్లుగా సినిమాను రూపొందించడం అంటే సవాలుతో కూడుకున్న విషయమే.

సుజీత్ లాంటి స్టైలిష్ డైైరెక్టర్.. అంత వెనుకటి కాలంలో పవన్‌కు సరిపోయే కథను తయారు చేయడం కొంత ఆశ్చర్యం కలిగించే విషయం కూడా. మరి సుజీత్ ఆలోచన ఎలా ఉందో మరి. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం ఇటీవలే తమిళ నటుడు అర్జున్ దాస్‌ను ఎంచుకున్నారు. ఖైదీ సహా కొన్ని అనువాద చిత్రాలతో అతడికి తెలుగులో మంచి గుర్తింపే వచ్చింది. తెలుగులో ‘బుట్టబొమ్మ’ సినిమా చేశాడతను. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

This post was last modified on June 11, 2023 6:05 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

దిల్ రాజు చేతిలో 18 కమిట్మెంట్లు

ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…

41 mins ago

అల్లు అర్జున్ వివాదం ఎక్కడి దాకా

ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…

2 hours ago

కృష్ణమ్మా….ఎంత పని చేశావమ్మా

సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…

3 hours ago

భువనగిరి : గెలిస్తే ఒక లెక్క .. ఓడితే మరో లెక్క !

శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…

5 hours ago

ఒక‌రు తీర్థ యాత్ర‌లు.. మ‌రొక‌రు విదేశీ యాత్ర‌లు!

ఏపీలో ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత‌.. ఒక‌వైపు తీవ్రమైన హింస చెల‌రేగిన విష‌యం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్ర‌తిపక్ష నాయ‌కులు…

6 hours ago

పోలీసులు ఏంచేస్తున్నారు.. చంద్ర‌బాబు ఆవేద‌న‌

ఏపీలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ అనంత‌రం.. ప‌ల్నాడు, తిరుప‌తి, తాడిప‌త్రి ప్రాంతాల్లో చెల‌రేగిన హింస‌పై చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం…

6 hours ago