Movie News

ఏజెంట్ ఎడిటింగ్.. ఎవరు చేస్తున్నారు?

నెలన్నర కిందట మంచి హైప్ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘ఏజెంట్’ మూవీ. ఈ సినిమా ప్రోమోలు చూసినపుడే ఏదో తేడాగా అనిపించింది కానీ.. మంచి సక్సెస్ రేట్ ఉన్న సురేందర్ రెడ్డి తప్పు చేసి ఉండడని.. అఖిల్ కెరీర్‌కు చాలా ముఖ్యమైన చిత్రం కాబట్టి టీం అంతా జాగ్రత్త పడే ఉంటుందనే నమ్మకం కలిగింది. కానీ తీరా థియేటర్లలోకి వెళ్లి కూర్చుంటే కానీ తెలియలేదు.. సురేందర్ అండ్ టీం ఎంత పెద్ద బ్లండర్ చేసిందని. స్క్రిప్టు దశలో సరైన కసరత్తు చేయకుండా ఏది పడితే అది రాసేసి.. మేకింగ్ టైంలో ముందు వెనుక చూసుకోకుండా ఎలా పడితే అలా తీసేసి.. ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూడా ఏమాత్రం కత్తెరకు పని చెప్పకుండా.. సినిమాను థియేటర్లలోకి వదిలేశారు. సినిమా చివరి వరకు కూర్చోవడం కష్టమయ్యే స్థాయిలో ఔట్ పుట్ ఉండటంతో ప్రేక్షకులకు తల బొప్పి కట్టేసింది.

మార్నింగ్ షోలతోనే సినిమా పెద్ద డిజాస్టర్ అని తేలిపోయింది. ఏ దశలోనూ పుంజుకోలేకపోయిన ‘ఏజెంట్’ వీకెండ్లోనే బకెట్ తన్నేసింది. ఈ సినిమా థియేటర్లలో ఉండగానే డిజిటల్ రిలీజ్ గురించి సోనీ లివ్ ఓటీటీ వాళ్లు అనౌన్స్‌మెంట్ ఇచ్చేశారు. థియేటర్లలో విడుదలైన రెండు వారాలకే ఈ సినిమాను డిజిటల్‌గా రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఎందుకో తర్వాత ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. వారం తిరిగేసరికే థియేటర్ల నుంచి లేచిపోయిన ఈ చిత్రాన్ని డిజిటల్‌గా రిలీజ్ చేయడానికి ఎందుకు పునరాలోచించారో అర్థం కాలేదు. సినిమా విడుదలై 40 రోజులు దాటినా ఇంకా ఓటీటీలోకి రాలేదు. ఐతే ఈ సినిమాకు ఇప్పుడు మార్పులు చేర్పులేవో చేస్తున్నట్లు వార్తలు వస్తుండటం విశేషం. సినిమాలో అనవసర సీన్లు తీసి.. ఇంకోవో  కలుపుతున్నారట.

కొంచెం క్రిస్ప్‌గా సినిమాను తీర్చిదిద్దుతున్నారట. కానీ ఈ పని ఎవరు చేస్తున్నారన్నది ఆసక్తికరం. నిర్మాత, హీరో పరోక్షంగా తన మీద విమర్శలు చేసి.. రెమ్యూనరేషన్ కూడా పూర్తిగా అందుకోని పరిస్థితుల్లో సురేందర్ అయితే ఇంకా ఈ ప్రాజెక్టుతో అసోసియేట్ అయి ఉండకపోవచ్చు. మరి సోనీ లివ్ వాళ్లు సొంతంగా చేయి చేసుకుంటున్నారా అన్నది ప్రశ్న. బహుశా నిర్మాత అనిల్‌కు దర్శకుడిగా అనుభవం ఉంది కాబట్టే ఆయనే ఈ ఎడిటింగ్ పని చేస్తున్నారేమో. ‘ఏజెంట్’కు ఓటీటీలో అయినా మంచి రెస్పాన్స్ తేవాలని ఆయన చూస్తుంటే అభినందనీయమే. కానీ ఇదంతా కూడా చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగానే కనిపిస్తోంది.

This post was last modified on June 10, 2023 5:13 pm

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

42 minutes ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

2 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

4 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

4 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

4 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

4 hours ago