భగవంత్ కేసరి టీజర్ వచ్చిన ఆనందంలో ఉన్న బాలకృష్ణ అభిమానులకు ఎన్బికె 109 అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చేసరికి ఇంకో స్వీట్ సర్ప్రైజ్ దక్కింది. ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య రూపంలో బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు బాబీ ఈ ప్రాజెక్ట్ ని చేపట్టబోతున్నారు. సితార బ్యానర్ కాబట్టి బడ్జెట్ పరంగా రాజీ ఉండదు. ఎలాగూ త్రివిక్రమ్ సలహాలు ఉండనే ఉంటాయి. అయితే దీని తాలూకు ప్రీ లుక్ ని వదిలిన సినిమా టీమ్ అందులో కొన్ని కీలకమైన క్లూస్ ఇచ్చింది. వాటిని జాగ్రత్తగా డీకోడ్ చేసుకుంటే లీకైన విషయాలతో లైట్ గా స్టోరీ లైన్ అల్లేసుకోవచ్చు.
ఇది 1980 నుంచి 90 మధ్యలో జరిగే కథగా సాగుతుందట. బయట ప్రపంచానికి తెలిసిన హీరో లోపలి లోకం వేరే ఉంటుంది. అది బయటికి కనిపించదు. బ్యాక్ డ్రాప్ ముంబైలో మొదలవుతుంది. రివెంజ్ డ్రామా షేడ్స్ ఉన్నాయి. పాత ట్రంకు పెట్టె, దానిలో మారణాయుధాలు, గోల్డ్ ఫ్లేక్ సిగరెట్ డబ్బా, మ్యాన్షన్ హౌస్ మందు బాటిల్, గొడ్డలి, సుత్తి, బులెట్లు ఇలా అన్నీ ఉన్నాయి. మరి బాలయ్య పోలీస్ ఆఫీసరా లేక కిల్లరా అనేది ఇప్పుడే చెప్పలేం. మాస్ ఎంటర్ టైనర్లు రాసుకునే బాబీ ఈసారి ఏదో స్టైలిష్ గా ట్రై చేసినట్టు ఉన్నాడు. లుక్ లో ఉన్న ముంబై మ్యాప్ ఆసక్తిని పెంచుతోంది
వచ్చే ఏడాది సంక్రాంతికి లేదా వేసవి కన్నా ముందు ఎన్బికె 109 రిలీజవుతుంది. పండగకే రావొచ్చు కానీ ప్రాజెక్ట్ కె, ఇండియన్ 2 లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ ఉండటంతో మార్చ్ లేదా ఏప్రిల్ లో ప్లాన్ చేయొచ్చు. సంగీత దర్శకుడు ఎవరో రివీల్ చేయలేదు. తమన్ ఆల్రెడీ వరసగా బాలయ్యవి మూడు చేశాడు. నాలుగోది ఇచ్చినా వద్దనడు. బాబీ ఎక్కువ వర్క్ చేసింది దేవిశ్రీ ప్రసాద్ తో. తనతోనే కంఫర్ట్ గా ఫీలవుతాడు. కానీ నిర్మాత నాగవంశీ మాత్రం తమన్ వైపే మొగ్గు చూపొచ్చు. ఇది కొంత కాలం సస్పెన్స్ గానే ఉండబోతోంది. హీరోయిన్ ఎంపిక త్వరలో చేస్తారు
This post was last modified on June 10, 2023 3:30 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…