నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఎప్పుడెప్పుడాని ఎదురు చూసిన భగవంత్ కేసరి టీజర్ చెప్పిన టైంకి కరెక్ట్ గా వచ్చేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ దసరాకు విడుదల కాబోతోంది. ఇవాళ నరసింహనాయుడు ఫోర్ కె రీ రిలీజ్ సంబరాలతో భగవంత్ కేసరి చేతులు కలిపాడు. అఖండ, వీరసింహారెడ్డి తర్వాత హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కాబోతున్న మూవీగా దీని మీద మాములు అంచనాలు లేవు. కథ గురించి పెద్దగా క్లూస్ ఇవ్వలేదు కానీ కేసరి క్యారెక్టరైజేషన్ గురించి మంచి మెటీరియల్ ఇచ్చారు.
భగవంత్ కేసరి(బాలకృష్ణ) ఎవరినీ లెక్క చేయని తత్వం. ఖైదీ నెంబర్ 108గా జైలు జీవితం గడిపి వచ్చాక తన చిరకాల శత్రువు(అర్జున్ రామ్ పాల్) ప్రమాదాలతో స్వాగతం చెబుతాడు. అయితే చేతిలో ఆయుధం ఉంటే చుట్టూ ఎంత మంది ఉన్నారు, ఏమేం చేస్తారనేది పట్టించుకోకుండా ఊచకోత చేయడమే లక్ష్యంగా పెట్టుకునే కేసరికి వాళ్ళెవరూ అడ్డు పడరు. మొండివాడు వాడి వెనుక ఉన్న ఒకే ఒక్క గుండెను చూపిస్తాడనే డైలాగ్ తో కేసరి వ్యక్తిత్వం గురించి హిట్ ఇచ్చేశాడు రావిపూడి. హిందీలో చెప్పే సామెత, యాక్షన్ విజువల్స్ అన్నీ ఫ్యాన్స్ కి కనుల పండులా ఉన్నాయి
విజయదశమికి రాబోతున్న భగవంత్ కేసరి మీద హైప్ ని ఒక్కసారిగా ఆకాశానికి తీసుకెళ్లేలా టీజర్ ని కట్ చేశారు. తెల్లని గెడ్డం, నల్లని జుత్తు, రగ్డ్ లుక్ తో బాలయ్య విశ్వరూపం మరోసారి చూడొచ్చన్న మాట. హీరోయిన్ కాజల్ అగర్వాల్ కానీ ప్రధాన పాత్ర చేస్తున్న శ్రీలీలను ఇందులో రివీల్ చేయలేదు. అర్జున్ రామ్ పాల్ ఫ్రేమ్స్ మొదట్లోనే ఓపెన్ చేశారు. టీజర్ చివర్లో బాలయ్య క్రికెట్ బ్యాట్ పట్టుకుని గిటార్ లా పాత పాటకు హమ్మింగ్ చేసుకుంటూ ముగించడం బాగుంది. మొత్తానికి భగవంత్ కేసరి విస్ఫోటనం శాంపులే ఈ రేంజ్ లో ఉంటే ఇక అసలు కంటెంట్ కోసం వెయిట్ చేయడం కష్టమే
This post was last modified on June 10, 2023 11:51 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…