దసరా ఇంకో నాలుగు నెలలు ఉండగానే బాక్సాఫీస్ పరిణామాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. సంక్రాంతి రేంజ్ లో స్టార్ హీరోలు నువ్వా నేనా అని తలపడేందుకు సిద్ధం కావడంతో డిస్ట్రిబ్యూటర్ల ఒత్తిడి మేరకు పలు అనూహ్య నిర్ణయాలు చోటు చేసుకోవచ్చని ఇన్ సైడ్ టాక్. బాలకృష్ణ భగవంత్ కేసరి విషయంలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. విజయదశమిని ఎప్పుడో లాక్ చేసుకుంది కాబట్టి రేపు టీజర్ లో డేట్ ని మరోసారి హై లైట్ చేస్తే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. రవితేజ టైగర్ నాగేశ్వరరావు వెనక్కు తగ్గే అవకాశం లేనట్టే. పండక్కే కట్టుబడదామని టీమ్ డిసైడ్ అయ్యిందట.
రామ్ బోయపాటి శీను కలయికలో రూపొందుతున్న సినిమాని ప్రీపోన్ చేసే ఆలోచన జరుగుతున్నట్టు వినికిడి. స్వతహాగా బాలయ్యతో తలపడటం ఇష్టం లేని బోయపాటి ఆ మేరకు నిర్మాతలను ఒప్పించి వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ ని జరిపి సాధ్యమైతే సెప్టెంబర్ విడుదల ప్రతిపాదనను ముందుంచుతారట. ఇది తేలడానికి కొంత టైం పట్టొచ్చు. అదే సీజన్ ని లక్ష్యంగా చేసుకున్న విజయ్ లియోని వారం ముందు అంటే అక్టోబర్ 12న తెచ్చే డిస్కషన్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ టీమ్ లో జరుగుతోంది. ఒకవేళ హీరో అంగీకారం తెలిపితే అనౌన్స్ మెంట్ ఇస్తారు.
లియోకి ఓ రిస్క్ ఉంది. తమిళంలో ఇబ్బంది లేదు కానీ తెలుగు రాష్ట్రాల్లో భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావుల వల్ల థియేటర్ల ఇబ్బంది వస్తుంది. దాని వల్ల రెవిన్యూ ప్రభావితం అవుతుంది. లోకేష్ కనగరాజ్ బ్రాండ్ ఇమేజ్, తీసుకున్న గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ వర్కౌట్ కావాలంటే కమల్ హాసన్ విక్రమ్ లాగా సోలో అడ్వాంటేజ్ తీసుకోవాలి. అందుకే లియో తేదీ మారినా ఆశ్చర్యం లేదు. మొత్తానికి ఒకపక్క షూటింగ్ జరుపుతూనే ఈ రెండు బృందాలు రిలీజ్ డేట్ మీద మల్లగులాలు పడుతున్నాయి. వెనక్కు తగ్గదేవరో ముందుకెళ్ళేది ఎవరో ఇంకొద్ది రోజుల్లో తేలిపోతుంది
This post was last modified on June 10, 2023 10:37 am
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…