సామాజిక సమస్యలు, వెనుకబాటు వర్గాల అణిచివేత మీద గొప్ప చిత్రాలు తీస్తాడని పేరున్న దర్శకుడు వెట్రిమారన్ కు తమిళంలోనే కాదు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. విడుదల పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా ఫెయిలైనా ఓటిటిలో చూసిన ఆడియన్స్ అందులో కంటెంట్ కి షాక్ అయ్యారు. ఈ కాలంలో ఇలాంటి కథలను చెప్పే డైరెక్టర్లు ఉన్నారాని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కోలీవుడ్ లో పార్ట్ 2 మీద మంచి క్రేజ్ ఉంది. విజయ్ సేతుపతికి సంబంధించి అసలు స్టోరీ అందులోనే ఉండటంతో సరైన రిలీజ్ డేట్ కోసం టీమ్ ఎదురుచూస్తోంది
దీని సంగతలా ఉంచితే వెట్రిమారన్ దగ్గర గతంలో తీసి థియేటర్లో కానీ ఓటిటిలో కానీ వదలకుండా ఉన్న సినిమా ఒకటుందని చెన్నై టాక్. దాని పేరు రాజన్ వగైయర. ధనుష్ తో చేసిన వడ చెన్నైకి ప్రీక్వెల్ గా దీన్ని రూపొందించారట. ఈ సిరీస్ ని మొత్తం మూడు భాగాలుగా ప్లాన్ చేసుకున్నారు. అయితే థర్డ్ పార్ట్ కి పరిస్థితులు అంత సానుకూలంగా లేకపోవడంతో రాజన్ వగైయరని అలాగే భద్రంగా ల్యాబ్ లో ఉంచినట్టు వినికిడి. దీన్ని బయటికి తీసుకురావాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ భాగంలో ధనుష్ ఉన్నాడా లేదనేది సస్పెన్స్ గా ఉంది.
భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ తో చేసే అవకాశం గురించి సంకేతాలు బలంగా ఉన్న నేపథ్యంలో వెట్రిమారన్ టాలీవుడ్ మీద కూడా ఫోకస్ పెడుతున్నారు. తారక్ తో ప్రాజెక్టు సెట్ అవుతుందో లేదో కానీ ఈ కాంబోలో ఒక ప్యాన్ ఇండియా మూవీ రావాలని మూవీ లవర్స్ కోరుకుంటున్నారు. అసురన్ తరహా సబ్జెక్టు ఒకటి పడితే జూనియర్ విశ్వరూపాన్ని వెట్రిమారన్ పూర్తిగా వాడుకుంటాడని వాళ్ళ ఫీలింగ్. ప్రస్తుతం సూర్య వడి వాసల్ తో బిజీగా ఉన్న ఈ విలక్షణ దర్శకుడు నెక్స్ట్ ఎవరితో చేయబోయేది చాలా గుట్టుగా ఉంచుతున్నారు. ఇంకో అయిదారు నెలలు ఆగాల్సిందే
This post was last modified on June 9, 2023 2:25 pm
ఇంకో శుక్రవారం వచ్చేస్తోంది. లాస్ట్ వీక్ భారీ అంచనాల మధ్య వచ్చిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి, ఓదెల 2 ఆశించిన…
ఇంకో ఎనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న హిట్ 3 ది థర్డ్ కేస్ కోసం నాని చేస్తున్న ప్రమోషన్లు జాతీయ…
సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ చీప్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టుపై విపక్ష వైసీపీ ఘాటుగా స్పందించింది. ఈ మేరకు వైసీపీ కీలక…
ఏడాదికి పైగా వెయిట్ చేసి మరీ అర్జున్ సన్నాఫ్ వైజయంతితో ప్రేక్షకుల ముందుకొచ్చిన కళ్యాణ్ రామ్ తాను కోరుకున్న స్థాయిలో…
నాయకులన్నాక.. ప్రజల మధ్య చర్చ ఉంటుంది. వారిచ్చే మార్కులు కూడా అవసరం. ఒకప్పుడు నాయ కులు.. ప్రజల ఆలోచనలు వేరేగా…
దేవర, ఆదిపురుష్ తో టాలీవుడ్ కు దగ్గరైన సైఫ్ అలీ ఖాన్ మనకు విలన్ గా పరిచయమే కానీ హిందీలో…