అర్జున్ రెడ్డి తర్వాత దాని హిందీ రీమేక్ కబీర్ సింగ్ తప్ప మరో సినిమా చేయని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కొత్త మూవీ యానిమల్ మీద ఓ రేంజ్ అంచనాలున్నాయి. బాలీవుడ్ లోనే కాదు ఇండియన్ స్క్రీన్ మీద మోస్ట్ యారొగెంట్ హీరో క్యారెక్టర్ లో రన్బీర్ కపూర్ కనిపించబోతున్నాడని ఇప్పటికే ఇన్ సైడ్ టాక్ భీభత్సంగా ఉంది. అందుకే సందీప్ అభిమానుల ఎదురు చూపులు మాములుగా లేవు. రష్మిక మందన్న హీరోయిన్, బాబీ డియోల్ విలన్, అనిల్ కపూర్ పవర్ ఫుల్ క్యారెక్టర్ ఇలా ఎన్నో ఆకర్షణలు యానిమల్ లో బోలెడు ఉన్నాయట
ముందు ప్రకటించిన ఆగస్ట్ 11 విడుదలకు యానిమల్ రావడం కష్టమేని ముంబై రిపోర్ట్. ఈ సమాచారాన్ని కన్ఫర్మ్ చేసుకున్నాకే అక్షయ్ కుమార్ – పంకజ్ త్రిపాఠిల ఓ మై గాడ్ 2ని అదే తేదీకి విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. యానిమల్ పోస్ట్ పోన్ వార్తను ఇంకా టి సిరీస్ అఫీషియల్ గా ధృవీకరించలేకపోయినా లోలోపల డిసైడ్ అయినట్టు తెలిసింది. ఆదిపురుష్ ప్రమోషన్లు, బిజినెస్ వ్యవహారాలతో బిజీగా ఉన్న భూషణ్ కుమార్ బృందం జూన్ చివరి వారంలో యానిమల్ కు సంబంధించిన ప్రకటన ఇవ్వబోతున్నారు.
ఇది మిగిలిన రిలీజులకు పెద్ద రిలీఫ్ ఇస్తుంది. ఆగస్ట్ 10 రజనీకాంత్ జైలర్ ని ప్యాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ చేసుకున్నారు. సో థియేటర్ల టెన్షన్ ఉండదు. చిరంజీవి భోళా శంకర్ కు బయట మార్కెట్ తో అవసరం లేదు కాబట్టి రిలాక్స్ అవ్వొచ్చు. అందరి కన్నా హ్యాపీగా ఫీలయ్యేది సన్నీ డియోల్. గదర్ 2కి గ్రౌండ్ ఇంకాస్త ఫ్రీ అవుతుంది. ఒకవేళ యానిమల్ ఉంటే అర్బన్ సెంటర్స్ లో ఇబ్బందులు వచ్చేవి. కానీ ఇప్పుడా సమస్య ఉండదు. ఈ ఏడాదిలో రిలీజులకు సంబంధించి చాలా నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
This post was last modified on June 9, 2023 10:39 am
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…