కన్నడ పవర్ స్టార్ గా పిలుచుకునే పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం ఇంకా అభిమానుల మనసులో నుంచి చెరిగిపోలేదు. తెలుగు ప్రేక్షకులకు అంత సుపరిచితం కాకపోయినా అతనెంత గొప్పవాడో పలు రకాల వీడియోలు, కార్యక్రమాల ద్వారా తెలుసుకున్న టాలీవుడ్ ఫ్యాన్స్ తన మీద ప్రత్యేక గౌరవం ఏర్పరుచుకున్న మాట వాస్తవం. చనిపోవడానికి ముందు కెజిఎఫ్ బ్యానర్ కు పునీత్ రెండు కమిట్ మెంట్స్ ఇచ్చాడు. అందులో యువరత్న విడుదలై సక్సెస్ సాధించింది. రెండోది ధూమం అనౌన్స్ మెంట్ వచ్చాక విషాదం జరిగిపోయి పునీత్ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు
ఇప్పుడా ధూమంని పుష్ప విలన్ ఫహద్ ఫాసిల్ తో పూర్తి చేశారు హోంబాలే ఫిలింస్. జూన్ 23న తెలుగుతో పాటు సౌత్ భాషలు అన్నిటిలోనూ రిలీజ్ కాబోతోంది. ట్రైలర్ కూడా వచ్చేసింది. చాలా వెరైటీ కాన్సెప్ట్ తీసుకున్నారు. థియేటర్లలో ఏదైనా సినిమా షో వేయడానికి ముందు పొగతాగితే వచ్చే పర్యవసనాలను వీడియో రూపంలో హెచ్చరికగా చూపిస్తారు. కానీ జనం వాటిని సీరియస్ గా పట్టించుకునే దాఖలాలు లేవు. కానీ దాన్ని నిజంగా చేసి చూపిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన హీరో లైఫ్ ని ప్రమాదంలోకి నెడుతుంది. అదేంటనేది రెండు వారాలు ఆగితే తెలుస్తుంది
పాయింట్ చాలా డిఫరెంట్ గా ఉంది. అపర్ణ బాలమురళి, ప్రేమదేశం వినీత్, అనుమోహన్, అచ్యుత్ కుమార్ ప్రధాన తారాగణం. క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో థ్రిలర్ స్టైల్ లో ప్రెజెంట్ చేశారు దర్శకుడు పవన్ కుమార్. ఈయన గత చిత్రం యుటర్న్ కన్నడలో ఎంత పెద్ద సంచలనమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ధూమంలో కూడా ఊహకందని ట్విస్టులు చాలా ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్థమైపోతోంది. పూర్ణచంద్ర తేజస్వి సంగీతం అందించిన ఈ సస్పెన్స్ డ్రామా ఏదో స్పెషల్ గానే ఉండబోతోంది. ఆదిపురుష్ వచ్చిన వారానికే ప్యాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేయడం విశేషం
This post was last modified on June 9, 2023 10:49 am
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 5 సీట్లకు ఐదుగురు అభ్యర్థులు ఖరారయ్యారు. ఈ నెలాఖరుకు ఖాళీ కానున్న…
కొత్తవే కాదు మహేష్ బాబు పాత సినిమాలు కూడా డిస్ట్రిబ్యూటర్లకు బంగారు బాతులైపోతున్నాయి. మురారి, బిజినెస్ మెన్ తర్వాత అయిదు…
తెలంగాణలోని ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి ప్రతిపక్షం బీఆర్ఎస్‌కు దక్కింది. దీనికి సంబంధించి పార్టీ అదినేత, మాజీ…
డెవిల్ తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుని కళ్యాణ్ రామ్ చేసిన సినిమా అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఇటీవలే ఫస్ట్…
దర్శకుడు పూరి జగన్నాథ్ రెండు వరస డిజాస్టర్ల తర్వాత కంబ్యాక్ కోసం పోరాడాల్సిన పరిస్థితి తలెత్తింది. లైగర్, డబుల్ ఇస్మార్ట్…
రాజకీయ అధినేతల మాటలు ఒకలా.. చేతలు మరోలా ఉండటం సహజం. మాట్లాడే సిద్ధాంతాలు.. విలువల్ని చేతల్లో చేసి చూపిస్తారనుకుంటే తప్పులో…