ఆదిపురుష్ విడుదల దగ్గర పడేకొద్దీ ఉచిత టికెట్లను ఇవ్వడం ద్వారా వీలైనంత ఎక్కువ మందికి సినిమాను చేరువ చేసే ప్రయత్నాన్ని ప్రొడక్షన్ కంపెనీ కన్నా ఎక్కువ బయట వాళ్ళు చేస్తుండటం విశేషం. మొన్న నిర్మాత అభిషేక్ అగర్వాల్ అనాధశరణాలయాలు, వృద్ధాశ్రమాలకు పది వేల టికెట్లను ఫ్రీగా ఇస్తానని హామీ ఇచ్చిన రెండు రోజులకే బాలీవుడ్ హీరో రన్బీర్ కపూర్ తాను కూడా చిన్న పిల్లలకు పది వేల టికెట్లు స్పాన్సర్ చేస్తానని ముందుకొచ్చారు. దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు విడుదల చేయబోతున్నారు. ఈ లెక్కన వీటికి లక్షలాది రూపాయలు ఖర్చు చేయబోతున్నారు
ఇది ఇక్కడితో ఆగేలా లేదు. పలు ధార్మిక సంస్థలు భక్తులు ఉద్యోగుల కోసం ఆదిపురుష్ టికెట్లను బల్క్ బుకింగ్స్ చేసేందుకు రెడీ అవుతున్నారు. కార్పొరేట్ కంపెనీలు సైతం ఎంప్లాయ్స్ కోసం స్పెషల్ షోలను రిక్వెస్ట్ చేయబోతున్నారు. రామాయణ చరితను అందరికి చేరవేసేందుకు ఇంతకన్నా మంచి అవకాశం రాదు కాబట్టి వీలైనంత వాడుకోవడానికి స్కెచ్ వేస్తున్నారు. అలియా భట్ తో కలిసి రన్బీర్ కపూర్ తో రామాయణం తీసేందుకు దర్శకుడు నితీష్ తివారి ప్లానింగ్ లో ఉన్నారని వార్త వచ్చిన కొద్దిగంటల్లోనే ఈ ఉచిత టికెట్ల వార్త రావడం గమనార్హం
ఇంకో ఎనిమిది రోజులు టైం కనక ఆదిపురుష్ కు సంబంధించి ఆశ్చర్యపరిచే వార్తలు చాలానే రాబోతున్నాయి. బిజెపి ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లో పన్ను మినహాయింపు కోసం టి సిరీస్ అధినేతలు చేసిన విన్నపాలు సఫలమయ్యాయట. తెలంగాణ ఏపీ లో టికెట్ రేట్ల హైక్ కోసం చేసిన వినతులు నెరవేరతాయో లేదో సోమవారానికి తేలిపోతుంది. మొదటి రోజు రికార్డు బ్రేక్ ఓపెనింగ్స్ ని ఆశిస్తున్న ఆదిపురుష్ మీద ఇప్పుడు పూర్తిగా పాజిటివ్ బజ్ వచ్చేసింది. 2 గంటల 59 నిమిషాల నిడివితో క్లీన్ యు సెన్సార్ సర్టిఫికెట్ కూడా వచ్చేసింది కాబట్టి ఆడియన్స్ 16వ తేదీ కోసం ఎదురు చూడటమే ఆలస్యం
This post was last modified on October 8, 2023 4:40 pm
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…